Breaking News

24/08/2019

యడ్డీకి తప్పని టెన్షన్

బెంగళూర్, ఆగస్టు 24, (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కు తలనొప్పులు తప్పడం లేదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి వరకే పరిమితం చేసిన అధిష్టానం ఆయనను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా కట్టడి చేసింది. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయం మేరకే జరిగింది. 17 మంది కొత్త మంత్రివర్గంతో కొలువుదీరినా యడ్యూరప్ప కు అసంతృప్తుల సెగ బాగానే తాకింది. తామేంటో చూపిస్తామని యడ్యూరప్పకు అసంతృప్త నేతలు వార్నింగ్ లు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కుమారస్వామి సర్కార్ అసంతృప్తితోనే కుప్పకూలింది. ఇప్పుడు యడ్యూరప్ప కు కూడా అదే అనుభవం ఎదురయింది. అసలే బితుకు బితుకుమంటున్న సర్కార్ .
యడ్డీకి తప్పని టెన్షన్

17 మంది ఎమ్మెల్యేల రాజీనామాతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుుడు బీజేపీ ఎమ్మెల్యేలు సయితం అదే బాటన పయనిస్తుండటం యడ్యూరప్ప ను ఇరకాటంలోకి నెట్టేసింది. మంత్రి వర్గ విస్తరణలో తన ప్రమేయం ఏదీ లేదని చెబుతున్నప్పటికీ అసంతృప్త నేతలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.ముఖ్యంగా బీజేపీ నేతలు ఉమేష్ కత్తి, బాలచంద్ర జార్ఖిహోళి, రేణుకాచార్య వంటి నేతలు బహిరంగంగానే గళం విప్పుతున్నారు. ఉమేష్ కత్తి అయితే ఏకంగా తన వద్ద ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ బెదిరింపులకు దిగారు. బీజేపీలో సీనియర్ నేతలు కొందరు బయట పడకపోయినప్పటికీ యడ్యూరప్ప మీద గుర్రుగా ఉన్నారు. తమను మంత్రి పదవికి ఎంపిక చేయకపోవడం వెనక యడ్యూరప్ప ఉన్నారని వారు గట్టిగా అనుమానిస్తున్నారు.దీంతో యడ్యూరప్ప ఈ తలనొప్పిని తట్టుకోలేకపోతున్నారు. తన తప్పేమీ లేదని చెబుతున్నా రోజురోజుకూ అసంతృప్తి ముదిరే అవకాశముండటంతో యడ్యూరప్ప అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని నేరుగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. హైకమాండ్ సయితం థిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరికలు పంపింది. అయినా అసమ్మతి నేతలు మాత్రం పట్టు వీడటం లేదు. యడ్యూరప్ప ప్రభుత్వం కూడా ఎన్ని రోజులు కొనసాగుతుందో? అన్నది సందేహమే.

No comments:

Post a Comment