Breaking News

13/07/2019

అందరికి లోకేషే టార్గెట్

గుంటూరు, జూలై 13, (way2newstv.in)
ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లి పోయేవాళ్లందరికీ నారా లోకేష్ టార్గెట్ అయ్యారు. లోకేష్ పార్టీలోకి వచ్చిన తర్వాతే పార్టీ క్రమంగా దిగజారిపోతుందన్న వ్యాఖ్యలు పార్టీలోనూ విన్పిస్తున్నాయి. లోకేష్ పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టిన తర్వాత మాత్రమే కొందరు నేతల పెత్తనం కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. సుజనా చౌదరి లాంటి వాళ్లు సయితం పార్టీని వీడి వెళ్లింది తన ప్రాధాన్యత తగ్గడం వల్లనేనని చెబుతున్నారు.ఇక ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కూడా నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీలో కొందరి పెత్తనం ఎక్కువయిందని ఆయన పరోక్షంగా లోకేష్ పై సతీష్ ప్రభాకర్ విమర్శలు చేశారు. అయితే లోకేష్ పై విమర్శలు చేసినా పార్టీ సీనియర్ నేతలు ఎవరూ ఖండించకపోవడం విశేషం. 
అందరికి లోకేషే టార్గెట్

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు లాంటి వాళ్లు కొంత లోకేష్ ను వెనకేసుకొచ్చారు కాని సీనియర్లు మాత్రం సైడై పోయారు.నిజానికి నారా లోకేష్ మంత్రిగా వచ్చినప్పటి నుంచి ఆయన జోక్యం ఇటు ప్రభుత్వంలో పెరిగిందంటున్నారు. కొందరు మంత్రులకు సయితం అప్పట్లో లోకేష్ అపాయింట్ మెంట్ లభించలేదని చెబుతారు. అలాగే మిగిలిన శాఖల్లోనూ లోకేష్ జోక్యం పెరిగిపోవడంతో అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇక హోంమంత్రిత్వ శాఖలో చినరాజప్పను చినబాబు డమ్మీ చేశారన్న ఆరోపణలున్నాయి.ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలో సయితం నారా లోకేష్ జోక్యం ఎక్కువగానే ఉంది. టిక్కెట్ల కేటాయింపు సమయంలో చంద్రబాబునాయుడు చెంతనే కూర్చుని నారా లోకేష్ టిక్కెట్ల కేటాయింపులో భాగస్వామి అయ్యారంటున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో గ్రూపు తగాదాలు, నేతల మధ్య సయోధ్య లేకపోవడానికి కూడా చినబాబు కారణమన్నది పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న చర్చ. లోకేష్ మంగళగిరిలో ఓడిపోవాలని సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ నేతలే కోరుకున్నారట. అయితే ఇప్పుడు నారాలోకేష్ ను ఎంత టార్గెట్ చేసినా ప్రయోజనం లేదు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment