Breaking News

05/07/2019

ఇంజనీరింగ్ కాలేజీలు దారి ఏదీ


హైద్రాబాద్, జూలై 5, (way2newstv.in)
రాష్ట్రంలో ఈ సారి సుమారు 30 వేల ఇంజనీరింగ్ సీట్లు మిగిలనున్నాయి. ఎంసెట్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగియగా, మొత్తం 54,836 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి 181 ఇంజనీరింగ్ కళాశాలల్లో 91,988 సీట్లు అందుబాటులోకి రానుండగా, 4,530 యాజమాన్య కోటా సీట్లు పోనూ 87,458 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.ఎంసెట్ కౌన్సెలింగ్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులందరూ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నా కన్వీనర్ కోటాలో ఈ సారి 32,622 సీట్లు ఖాళీగా మిగలనున్నాయి.

ఇంజనీరింగ్ కాలేజీలు దారి ఏదీ


 అయితే స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థుల్లో కొంతమంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ గైర్హాజయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు గైర్హాజరైతే మరిన్ని సీట్లు మిగిలే అవకాశం ఉంటుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో 70 శాతమే రిపోర్టింగ్ చేస్తున్నారని, మిగతా 30 శాతం అసలు రిపోర్టింగే చేయడం లేదు. కన్వీనర్ కోటా కింద 87,458 ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించినా అందులో సుమారు 50 వేల సీట్ల వరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఒకప్పుడు ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్‌లో చేరేవారు. రానురాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తోంది. ఖర్చు ఎక్కువైనా ఎన్‌ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ సీటు రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు.దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య తగ్గుతున్నా, కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. 2017-18 విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 201 కళాశాలల్లో 70,427 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్‌లో 54,583 సీట్లు భర్తీ అయ్యాయి. 12,264 సీట్లు ఖాళీగా మిగిలాయి. 201819 విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా కింద 69,782 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్‌లో 48,982(74.15 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత విద్యాసంవత్సరం ఐదు కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ నమోదు కాగా, ఆరు కళాశాలల్లో సింగిల్ డిజిట్‌లో ప్రవేశాలు నమోదయాయయి. 29 కళాశాలల్లో 50లోపు, 55 కళాశాలల్లో 100లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ సారి సుమారు 30 వేల ఇంజినీరింగ్ సీట్లు మిగులనున్నట్లు తెలుస్తోంది.ఇంజనీరింగ్ సీట్లు ఏటా మిగులుతున్నాయి. డిమాండ్ ఉన్న బ్రాంచీలు మినహా దాదాపు అన్ని కళాశాలల్లో సీట్లు మిగులుతున్నాయి. ఇదివరకు టాప్ కళాశాలల్లో కన్వీనర్‌తో పాటు యాజమాన్య కోటా సీట్లు 100 శాతం భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజ ర్వ్ చేసుకునేవారు. ఈ ఏడాది టాప్ కళాశాలల్లో కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగిలే అవకాశం కనిపిస్తుంది. మధ్యస్థంగా ఉన్న కళాశాలల్లో సీట్లు భర్తీ అవుతాయా..? లేదా..? అని యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి

No comments:

Post a Comment