Breaking News

05/07/2019

జగన్ పాలనలో .....


టీడీపీ నేతకు తొలి ఉద్యోగం
శ్రీకాకుళం, జూలై 5 (way2newstv.in)
మేము పార్టీలు చూడం, రాజకీయాలు చేయం, అందరినీ సమానంగా చూసుకుంటాం, మాకు పార్టీలూ రంగులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం. ఇది ముఖ్యమంత్రి కాక ముందు నుంచి జగన్ చెబుతున్న మాట. దానికి తగ్గట్టుగానే వైసీపీ సర్కార్ ఏర్పాటు అయిన తరువాత తొలి ఉద్యోగం దక్కింది ఆ పార్టీ వారికి కాదు, కరడు కట్టిన టీడీపీ కార్యకర్తకు. ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లాలో ఇది జరిగింది. ఏ పార్టీ అయితే ఓడిపోవాలనుకుందో, ఆ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఆమెకు జాబ్ రావడం విశేషం. శ్రీకాకుళం పట్టణంలో ధర్మాన ప్రసాదరావు గెలవవద్దు అంటూ ఇంటింటికీ తిరిగి గట్టిగా ప్రచారం చేసిన టీడీపీ కార్యకర్తకు జాబ్ రావడం, అదీ తమ పార్టీ నాయకులే దగ్గరుండి జాబ్ ఇప్పించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రగిలిపోతున్నారు.మెప్మాలో సీ ఎల్ ఆ పీ పోస్ట్ ఒకటి ఖాళీ తాజాగా అయింది. ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడ్డారు కానీ టీడీపీకి చెందిన దంతంశెట్టి అరుణ తన్నుకుపోయారు. ఆమెకు సహాయం చేసింది ఎవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. 

జగన్ పాలనలో........
శ్రీకాకుళంలో ఈ పోస్ట్ ఖాళీ అయితే ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు చెప్పకుండా ఆ వైసీపీ నాయకుడు చక్రం తిప్పాడు. ఏకంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో చెప్పి మరీ ఆర్డర్ కాపీ తెచ్చి మరీ ఆ టీడీపీ కార్యకర్త చేతిలో పెట్టాడంటే సన్మానం చేయాల్సిందే. ఎందుకంటే అతను జగన్ చెప్పినట్లుగానే చేశాడు మరి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అర్హత కూడా చూడమని జగన్ చెప్పారు. కానీ ఏ అర్హత లేకపోయినా పైరవీలు చేసి మరీ ఆ టీడీపీ నాయకురాలికి పదవి ఇప్పించడం వెనక వైసీపీ నేతకు ఉన్న ఆసక్తి ఏంటన్నది ఇపుడు చర్చకు వస్తోంది.మొదటిసరిగా ఒక పోస్ట్ ఖాళీ అయితే దాన్ని తిరిగి టీడీపీ కార్యకర్తకు ఇవ్వడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రగిలిపోతున్నారుట. అయిదు వార్డులో మహిళా సంఘాలను కలుపుకుని కార్యక్రమాలు నిర్వహించే కీలక‌మైన పోస్ట్ ఇది. పది వేల వరకూ జీతం ఉంటుంది. ఈ పోస్ట్ ని వైసీపీ మహిళకు ఇస్తే పార్టీకి కూడా ఉపయోగంగా ఉండేదని ఫ్యాన్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ ఓటమి కోసం కంకణం కట్టుకున్న అరుణ అన్నంత పనీ చేసింది. తాను ప్రచారం చేసి బాధ్యతలు చూసిన బూత్ లో టీడీపీకి మెజారిటీ తెచ్చింది. అక్కడ ధర్మాన ప్రసాదరావుకు 260 తక్కువ పడ్డాయి. టీడీపీ మహిళా ఇంచార్జిగా ఉంటూ కరడు కట్టిన మహిళకు పోస్టులు ఇప్పిస్తే క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇది నిజంగా వైసీపీ నేతల చేతగానితనమైతే అర్హత లేకపోయినా వైసీపీ వచ్చిన కొత్తల్లొనే పదవి కొట్టేసిన ఆ తెలుగు మహిళా గ్రేట్ అంటున్నారు.

No comments:

Post a Comment