Breaking News

01/07/2019

ఐసీసీ నుంచి విజయ్ శంకర్ ఔట్


లండన్, జూలై 1, (way2newstv.in)

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తొలి పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టుకి సెమీస్ ముంగిట మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన యార్కర్‌ని అడ్డుకోవడంలో ఫెయిలైన విజయ్ శంకర్ గాయపడి.. టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. శంకర్‌ కాలి వేలికి తీవ్ర గాయమవగా.. పరిశీలించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో అతను ప్రపంచకప్‌కి దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ప్రపంచకప్ ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవగా.. 

ఐసీసీ నుంచి విజయ్ శంకర్ ఔట్

ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. తాజాగా విజయ్ శంకర్‌ గాయపడటంతో.. టీమ్‌‌లో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య ముగ్గురికి చేరింది. అయితే.. శిఖర్ ధావన్ స్థానంలో ఇప్పటికే రిషబ్‌ పంత్‌ని జట్టులోకి తీసుకోగా.. భువనేశ్వర్ కుమార్ ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. తాజాగా గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని సెలక్టర్లు ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేయడం ద్వారా.. శిఖర్ ధావన్ ఓపెనింగ్ స్థానాన్ని కూడా భర్తీ చేయాలని టీమిండియా యోచిస్తోంది. అదే జరిగితే..? ప్రస్తుతం ఓపెనర్‌గా ఆడుతున్న కేఎల్ రాహుల్ మళ్లీ నెం.4 స్థానంలోకి మారతాడు. అప్పుడు రిషబ్ పంత్‌పై వేటు పడే అవకాశం ఉంది. ప్రపంచకప్‌కి టీమ్‌ని ఎంపిక చేసే సమయంలోనే అంబటి రాయుడ్ని పక్కన పెట్టి శంకర్‌‌కి ఛాన్స్ ఇవ్వడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

No comments:

Post a Comment