Breaking News

01/07/2019

కొత్త సచివాలయం నిర్మిస్తాం : తలసాని


హైద్రాబాద్, జూలై1, (way2newstv.in)
ఆరునూరైనా కొత్త సచివాలయం, అసెంబ్లీ కట్టి తీరుతామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు గర్వపడాలే ఈ రెండింటిని నిర్మిస్తామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు సచివాలయం వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి వెళ్లారని, నాలుగు గంటల పాటు అన్ని భవనాలను పరిశీలించవచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన పనులనే కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని, గ్రూప్ తగాదాలు చూడలేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని విమర్శించారు. 

కొత్త సచివాలయం  నిర్మిస్తాం : తలసాని

ప్రతిపక్షనేతగా ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉండటం సొంత పార్టీ నేతలకే ఇష్టం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్షం పడితే ఏ నగరంలో అయినా గంటపాటు ఇబ్బందులు తప్పవని, ఒక్క హైదరాబాద్ లోనే ఏదో జరుగుతుందనే దుష్ప్రచారం సబబు కాదని హితవు పలికారుకాంగ్రెస్ పై బాల్కా సెటైర్లు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతల బుర్రలకు బూజు పట్టిందని, వీధి డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ వ్యాప్తంగా పొగుడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment