Breaking News

11/07/2019

గోదావరితో పులకరిస్తున్న కాళేశ్వరం

కరీంనగర్, జూలై 11 (way2newstv.in)
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పంప్‌హౌజ్ కన్నెపల్లిలో నాలుగో మోటార్‌ను వెట్న్ చేశారు. ఈ అద్భుతం చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కన్నెపల్లి బ్యారెజ్ నుంచి నాలుగు మోటార్ల నీరు దుంకుతున్న దృశ్యం అద్భుతాన్ని తలపించింది. కన్నెపల్లి ప్రాజెక్టులో 4.5 మీటర్ల పైన నీటి స్టోరేజీ ఉంది. గోదావరి నదికి ప్రాణహిత నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. వచ్చిన నీటిని ఒడిసిపట్టి ఎత్తిపోతల ద్వారా కింది ప్రాజెక్టుల్లో నీటిని స్టోరేజీ చేస్తున్నారు. అందులో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి ప్రతీరోజు నీటిని ఎత్తిపోస్తున్నారు. బుధవారం ఉదయం వరకు మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. మధ్యాహ్నం నాలుగో మోటార్‌ను ప్రారంభించడంతో గోదావరి జల తీవ్ర రూపం దాల్చింది. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారెజ్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ నాలుగు మోటార్ల నీటితో నిండుకుండలా ఉరకలు పెడుతుంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు నీటి ఫ్లో ప్రాణహిత ద్వారా వస్తూనే ఉంది. 
గోదావరితో పులకరిస్తున్న కాళేశ్వరం

అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లో రెండు రోజుల నుంచి కురవడంలేదు. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణహిత నదితో గోదావరి నది ఉప్పొంగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన మోటార్ల వెట్న్‌క్రు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్నారం బ్యారెజ్‌కి  వరకు రెండు టీఎంసీల వరకు నీరు చేరుతుంది. మొత్తం సామర్థం 10.87 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన తరువాతనే అన్నారం గేట్లు తెరువనున్నట్లు సీడబ్లూసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అన్నారం ద్వారా వచ్చే నీటిని సుందిళ్లకు మళ్లించడానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. సుందిళ్ల నుంచి మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు గోదావరి ఎత్తిపోతల నీటిని మళ్లించనున్నారు. అందుకు సంబంధించిన అవకాశం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలు కురిసి గోదావరి ఉప్పొంగితే 15 రోజుల్లోనే ప్రాజెక్టులన్నీ నింపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పనులన్నీ పూర్తి కావడం వల్లనే గోదావరి నుంచి వస్తున్న ప్రతీ నీటి బొట్టును ఎత్తిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులు భారీ విజయాన్ని సాధించారు. కన్నెపల్లిలో నిరంతరం మోటార్ల ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయడంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోవడం ప్రాజెక్టు విజయానికి నిదర్శనంగా మారింది.

No comments:

Post a Comment