Breaking News

02/07/2019

టిఆర్టీ నియామకాలపై నిరసన


అంబేద్కర్ విగ్రహానికి వినతి
షాద్ నగర్, జూలై 2, (way2newstv.in)
టిఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వలని టిఆర్టీ నియామకాలు  చేపట్టాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో టీవివి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో టిఆర్టీ అభ్యర్థులు మంగళవారం నిరసన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా టిఆర్టీ నియమకలలో జరుగుతున్న జాప్యం వల్ల సెలెక్ట్ అయిన అభ్యర్థులను నేటికి విధులలోకి తీసుకోకుండా వున్నారు. 

 టిఆర్టీ నియామకాలపై నిరసన

సెలెక్ట్ అయిన అభ్యర్ధుల స్థానాల్లో వివిలను పెట్టి  ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇవ్వడం,  రేషనలైజేషన్ పెరిట పాఠశాలలను విలీనం చేస్తూ టిఆర్టీ అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం  దారుణమని విమర్శించారు.  తెలంగాణ వ్యాప్తంగా 7 మంది అభ్యర్థులు మృతి చెందారని అయిన కూడా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా ప్రభుత్వం సెలెక్ట్ అయిన టిఆర్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. 

No comments:

Post a Comment