కర్నూలు, జూలై 29, (way2newstv.in -Swamy Naidu)
భూమా అఖిలప్రియకు ఇక రాను రాను కష్టాలు తప్పేట్లు లేవు. అయిన వాళ్లే ఆమెను కాదు పొమ్మంటున్నారు. ఇప్పటి వరకూ అండగా ఉన్న కుటుంబ సభ్యులే పక్కన పెట్టేశారు. అసలే ఎన్నికల్లో ఓటమి భారంతో కుంగిపోయిన భూమా అఖిలప్రియకు వరస దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే దీనికంతటికీ కారణం భూమా అఖిలప్రియ స్వయంకృతాపరాధమే కారణమని అన్నది వాస్తవం.తల్లి, తండ్రి మంచి పొలిటికల్ గ్రౌండ్ ను ఇచ్చారు. బలమైన క్యాడర్ ను ఉంచారు. పటిష్టమైన ఓటు బ్యాంకును భూమా కుటుంబానికి క్రియేట్ చేశారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ రాజకీయంగా తప్పటడుగులు వేస్తూ వచ్చారు.
అఖిల ప్రియకు కష్టాలేనా
చిన్న వయసులో మంత్రి పదవి దక్కడం కూడా అందుకు కారణం కావచ్చు. అహం పెరిగి భూమా అఖిలప్రియ ఎవరినీ లెక్క చేయలేదంటారు. అందుకే తన తండ్రికి అత్యంత సన్నిహితులను కూడా ఆమెను పక్కన పెట్టేశారు.అఖిలప్రియ మంత్రి అయిన వెంటనే ఆళ్లగడ్డలో రాంగ్ సిగ్నల్స్ కన్పించాయి. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో ఆమె విభేదాలు కొనితెచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి అఖిలప్రియకు కష్టాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ముఖ్యనాయకులంతా హ్యాండ్ ఇవ్వడం కూడా ఆమె పరాజయానికి కారణంగా చెప్పాలి. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇక భూమా అఖిలప్రియ రాజకీయంగా కోలుకోవడం కష్టమేనని అనిపిస్తోంది.భూమానాగిరడ్డి అన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనక కూడా భూమా కుటుంబసభ్యులు ఉన్నారని తెలుస్తోంది. అఖిలప్రియ భర్త వ్యవహారశైలి పట్ల విసుగుచెందిన కుటుంబసభ్యులు అఖిలప్రియను పక్కన పెట్టాలని భావించారు. అందుకే భూమా వర్గాన్ని కాపాడుకునేందుకు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం విశేషం. ఇలా ఆళ్లగడ్డలో అఖిలప్రియ కుటుంబం రెండుగా చీలడం ఇటు పార్టీకి, వ్యక్తిగతంగా ఆమెకు మంచిది కాదన్నది విశ్లేషకుల భావన.
No comments:
Post a Comment