శ్రీకాకుళం, జూలై 25, (way2newstv.in)
చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వాళ్ల కోసమే సైరాను మరింత త్వరగా పూర్తి చేసి అది మొదలుపెట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్ డేట్ కూడా బయటికి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుంది. సైరా పూర్తి కాగానే ఈ చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు మెగాస్టార్. మరోవైపు కొరటాల కూడా ఈ చిత్రం కోసం ఏడాదిన్నరగా వేచి చూస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల మరో సినిమా ఒప్పుకోలేదు.ఈ చిత్రం కోసమే రెండు మూడు కథలు సిద్ధం చేసి చిరంజీవి మెప్పు పొందాడు. ఇప్పుడు షూటింగ్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు.
పలాసకు ప్రజారాజ్యం అధినేత
ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం మొదలు కానుందనే ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు మాత్రం మరో రెండు నెలల తర్వాత కానీ చిరంజీవి, కొరాటల సినిమా పట్టాలెక్కదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈమె పాత్ర సినిమాకు కీలకం కానుంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన మరోసారి నయనతార హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ల కోసం కూడా కొరటాల చూస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది.సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో మొదలు కాబోయే ఈ చిత్ర తొలి షెడ్యూల్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి షూటింగ్ కోసం వెళ్లనున్నాడు. చిరు సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నాడు.మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు మెగా వారసుడు.కొరటాల సినిమా ముందున్నా కూడా ప్రస్తుతం చిరంజీవి మనసు మొత్తం సైరా సినిమాపైనే ఉంది. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు మెగాస్టార్. అక్టోబర్ 2న సైరా విడుదలైన తర్వాత కొరటాల సినిమాపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టనున్నాడు ఈయన. ఈ సినిమాను అక్టోబర్‌లో పట్టాలెక్కించి వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.
No comments:
Post a Comment