Breaking News

06/07/2019

ఎకో టూరిజం ద్వారా కొల్లాపూర్ అభివృద్ధి


కొల్లాపూర్ జూలై 06 (way2newstv.in
కొల్లాపూర్ మండలం  అమరగిరి కృష్ణానది పరివాహక ప్రాంతంలో  ఎకో టూరిజం ద్వారా నల్లమల సరిహద్దులలో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలతో శనివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజంశాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్,  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  టూరిజం అధికారులతో సమీక్షా నిర్వహించారు.  కొల్లాపూర్ ప్రాంతంలో  కృష్ణానది పరివాహక ప్రాంతంలో అమరగిరి, సోమశిల,  శిల, కోతిగుండు నల్లమల సరిహద్దులలో టూరిజం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. 

ఎకో టూరిజం ద్వారా కొల్లాపూర్ అభివృద్ధి 

అధికారులతో మంత్రి గారు, ఎమ్మెల్యే గారు సమీక్షా నిర్వహించారు.  అమరగిరి దగ్గర లక్నవరం మాదిరిగా వంతెన నిర్మించాలని, అదే విధంగా కృష్ణానది ఉండడం చుట్టూ నల్లమల అందాలు ఉంటాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అన్నారు. త్వరగా పనుల కొరకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని  మంత్రి శ్రీనివాస్ గౌడు  అధికారులకు ఆదేశించారు.  టూరిజం పరంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు ఆహ్లాదంగా ఉటుందని, కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.

No comments:

Post a Comment