Breaking News

17/07/2019

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు

తిరుమల, జూలై 17,  (way2newstv.in)
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది, విఐపీ దర్శనాలకోసం అమలు చేస్తున్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానాలకు బుధవారం నుంచి రద్దు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. విఐపి దర్శనాల రద్దు రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తామని అయన వివరించారు. 
తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు

ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కోరాను తప్ప,  ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కు కోరలేదని అయన అన్నారు. టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై సుబ్బారెడ్డి మండిపడ్డారు. తండ్రీకొడుకుల్లాగా నేను,మా ముఖ్యమంత్రి దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. దేవుడు సొమ్ము ఒక్కరూపాయి కూడా నేను తాకను. అవసరమైతే నా చేతి నుంచి పదిమందికి సహాయం చేస్తానని అయన అన్నారు. 

No comments:

Post a Comment