Breaking News

17/07/2019

ఊరించి... ఊసూరుమనింపించిన వానలు

కర్నూలు, జూలై 17 (way2newstv.in)
ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు,పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న రైతులు జూలై నెలలో కురిసే వర్షాలపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జూలై నెలలో వర్షలు పడితేనే రైతన్నల కంట్లో వెలుగులు వస్తాయి. కాబట్టి ఎన్నో ఆశలతో రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో 8 మండలాల్లో అదిక వర్షాలు కురిశాయి. 9 మండలాల్లో రావాల్సిన వర్షం కన్నా తక్కువ వర్షపాతం కురిసింది. జూన్ నెలలో 8 మండలాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల కూడా ఎలాంటి పలితం లేకుండాపోయింది.  వర్షాలు పడకపోవడంతో వేసిన కొద్దిపాటి విత్తనాలు భూమిలో వేసిన ఫలితం లేకుండాపోయింది. విత్తనం మొలక దశలోనే ఎండిపోవడం రైతన్నలకు తీవ్ర నష్టం కల్గించింది. 
 ఊరించి... ఊసూరుమనింపించిన వానలు

రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఆదోని మండలంలో 108మి,మీగాను 72,మి,మీ, కౌతాళం మండలంలో 106మిమీగాను 88.2మి,మీ, పెద్దకడబూరు మండలంలో 100మి,మీ గాను 68.2మి,మీ, ఆస్పరి మండలంలో 92,మిమీగాను 80.6మి,మీ, చిప్పగిరి మండలంలో 57మి,మీగాను 26.6మి,మీ,పత్తికొండ మండలంలో 90మి,మీగాను 24.8మి,మీ,తుగ్గలి మండలంలో 94,మిమీగాను 23.6మి,మీ, మద్దికెర మండలంలో 70,మి,మీగాను 16మి,మీ, గోనెగండ్ల మండలంలో 79మి,మీగాను 66.8మి,మీ వర్షం మాత్రమే కురిసింది. 9 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం జరిగింది. అందువల్ల 9 మండలాల్లో ఇప్పటి వరకు విత్తనం కూడా వేయని పరిస్థితి ఉంది. అధికంగా వర్షాలు కురిసిన ఎమ్మిగనూరు,మంత్రాలయం, కోసిగి, ఆలూరు, మొదలగు మండలాల్లో 20 రోజులు వర్షం రాకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎర్ర నెలల్లో వేసిన ముంగారి పత్తి పంట మొలకలదశలోనే 80శాతం దెబ్బతినిపోయిందని రైతులు వాపోతున్నారు.అందువల్ల రైతులు జూలై నెలలో కురిసే వర్షాలే తమను గట్టేకిస్తాయని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.అయితే జూలై నెలలో ప్రారంభమై వారం రోజులు కావస్తున్న ఇప్పటి వరకు డివిజన్ మొత్తం మీద భారీ వర్షాలు కురువలేదు. తొలకరి చినుకులు, లేదా తేలికపాటి వర్షాలతోనే సరిపోడుతుంది. మేఘాలు ఒక వైపు మబ్బులు కమ్ముకుంటున్నాయి. కాని తూతూమంత్రంగా చినుకులు రాలిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆరుశాతం మాత్రమే డివిజన్‌లో విత్తనాలు పడ్డాయి. ఖరీఫ్ సీజన్‌లో ఆదోని డివిజన్‌లో రెండు లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారు. ముఖ్యంగా ఎర్ర నెలల్లో వేరుశెనగ, సజ్జ, పచ్చజొన్న, మొదలగుపంటలు వేయడం జరుగుతుంది. ఇలాగే వర్షాలు వస్తే నల్లరేగడి భూముల్లో పత్తి పంటవేయడం జరుగుతుంది. ఎక్కువశాతం ఈ సంవత్సరం కూడా రైతులు పత్తిపంట వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే నల్లరేగడిలో తెల్లజొన్న పంట వేయడం రైతులు 99శాతం తగ్గించి వేశారు. అలాగే శెనగ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో శెనగ పంటను కూడా వేయడం లేదు. కుసుమ,కొర్ర పంటలు రైతులు వేయడం లేదు. ఎక్కడో ఒక్కచోట అక్కడక్కడ కొర్ర పంట కనిపిస్తుంది. కావున రైతులు పత్తి పంట వేయడానికి అలాగే వేరుశెనగ పంటను విత్తనాలను విత్తడానికి సిద్దం చేసుకోని ఉన్నారు. అయితే జూన్ నెలలో వర్షాలు రైతుల ఆశలను నేరవేర్చలేదు. అందువల్ల రైతులు జూలై నెలలో కురిసే వర్షాలపైన ఆదార పడుతున్నారు. ఆదోని డివిజన్‌లో జూలై నెలలో వర్షాలు కూడా వారం రోజులై కురవని పరిస్థితి ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఆదోని డివిజన్‌లో మాత్రం వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయి. రైతన్నలు మేఘాలవైపు ఆశతోచూస్తున్నారు.జూలై నెలలో వర్షాలు రైతులు పెట్టుకున్న ఆశలను నేరవేర్చుస్తాయో .. లేదో వేచి చూడాలి. ఇప్పటికే పంటలు వేయక పంట భూములు చినుకు కోసం ఎదురు చూస్తున్నాయి. వరం నీటితో నిండే చెరువులు భారీ వర్షాల కోసం నోరు తెరుచుకుని ఉన్నాయి.

No comments:

Post a Comment