Breaking News

17/07/2019

రెబల్స్‌ పై నిర్ణయం స్పీకర్‌ ఇష్టం

తీర్పును వెలువరించిన సుప్రీం కోర్ట్
న్యూఢిల్లీ జూలై 17  (way2newstv.in
కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు బుధవారం ఒక కీలక నిర్ణయాన్ని వెలిబుచ్చింది. బుధవారం విచారణ చేసట్టిన ధర్మాసనం  ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై నిన్న సుదీర్ఘ వాదనలు విన్న విషయం తెలిసిందే. 
రెబల్స్‌ పై నిర్ణయం స్పీకర్‌ ఇష్టం

రాజీనామాలపై కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. మరోవైపు బలపరీక్షకు హాజరుకావాలా వద్దా అన్నది మాత్రం ఎమ్మెల్యేల ఇష్టమని వెల్లడించింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని వెల్లడించింది. తీర్పు అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మీడియాతో మాట్లాడారు. ‘కర్ణాటక అసెంబ్లీలో గురువారం  విశ్వాసపరీక్ష ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండు కీలక విషయాలు వెల్లడించింది. ఒకటి రెబల్స్‌ పై ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌కు ఉంది. ఇక రెండోది సుప్రీంను ఆశ్రయించిన 15 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరుకావాలా వద్ద అనేది వారి ఇష్టం. అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యేలను బలవంతం చెయ్యలేమని చెప్పిందని అన్నారు. 

No comments:

Post a Comment