Breaking News

17/07/2019

వెబ్ సైట్ లో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

విజయవాడ, జూలై 17 (way2newstv.in)
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల మార్కుల మెమోలు విడుదలయ్యాయి. మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్ అయి విద్యార్థుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ లో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో ఇంటర్ ప్రవేశాల గడువు జులై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రవేశాలు కోరేవారు ఈ మెమోలను దరఖాస్తు సమయంలో సంబంధిత కళాశాలలో సమర్పిస్తే సరిపోతుంది. పదోతరగతి మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..ఈ ఏడాది జూన్ 17 నుంచి 29 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జులై 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,923 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 24,425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 66.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 66.60 శాతం బాలికలు కాగా.. 65.77 శాతం బాలురు ఉన్నారు. 

No comments:

Post a Comment