Breaking News

20/06/2019

ఇంద్రకీలాద్రిలో వరుణ యాగం


విజయవాడ జూన్ 20, (way2newstv.in)
కనకదుర్గమ్మ దేవస్థానం ఆద్వర్యంలో వరుణ యాగం ప్రారంభమయింది. రాష్ట్రంలో   ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రత తీవ్రంగా వున్న కారణంగా, ప్రజలు  ఇబ్బంది పడుతుండటంచేత సకాలంలో వర్షాలు లేక రైతులు,  వ్యవసాయానికి ఆటంకం కల్గడం తో రాష్ట్రం సస్యశ్యామలం ఉండడం కోసం లోక కల్యాణార్థమై వరుణ యాగం చేస్తున్నారని ఆర్చకులు అంటున్నారు.  


ఇంద్రకీలాద్రిలో వరుణ యాగం
ఈ సందర్బంగా  దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ ఆద్వర్యంలో వేద విద్యార్దులు, పండితులు దుర్గ ఘాట్ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధికారిణి కోటేశ్వరమ్మ  దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా వరుణ యాగం లో పాల్గొని పూజలు చేశారు. ఉదయం 06 గం.ల దేవస్థాన వేదం విద్యార్థులు, అర్చక స్వాములు దుర్గాఘాట్ నందు వరుణ జపం, వారుణానుపాక పారాయణములు, శతానువాక పారాయణలు,  విరాట్ పర్వ పారాయణము జరిగింది. నదీ లో కూర్చుని వేద విద్యార్దులు, పండితులు వరుణ జపలు నిర్వహించారు.

No comments:

Post a Comment