అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట్ పార్టీకి వెళ్లినా.. అంతా తామై నడిపించిన మోడీషాలదే తాజా విజయమని చెప్పటంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు.అయితే.. తాజాగా ముగిసిన ఎన్నికల పుణ్యమా అని మోడీషాలకు మీద పడిన మచ్చ వారిని తెగ ఇబ్బందికి గురి చేస్తోంది.రెండు దఫా విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ.. సీనియర్లను పక్కన పెట్టేసి.. చేతులు దులుపుకున్నారన్న చెడ్డ పేరు మాత్రం మోడీషాలను వెంటాడుతోంది. బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ.. మురళీమోహన్ జోషిలాంటి వారి మొదలు సుమిత్రా మహాజన్ లాంటి వారిని వయసు పేరు చెప్పి పక్కన పెట్టేశారన్న విమర్శ ఉంది.
రాజ్యసభకు బీజేపీ సీనియర్లు
ఇక.. విదేశాంగ మంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మాత్రం తాను పోటీ చేయనని గతంలోనే స్పష్టం చేయటం తెలిసిందే.సీనియర్లను పక్కన పెట్టేసి.. పార్టీ మొత్తాన్ని తామే ఏలేస్తున్నామన్న మరకను తుడుచుకునే దిశగా చర్యలు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. తమపైన వచ్చిన విమర్శల్లో పస లేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు మోడీ ఈ మధ్యన నష్టనివారణ చర్యల్ని చేపట్టటం కనిపిస్తుంది. తానురెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు అద్వానీ.. జోషి లాంటి వారిని కలిసి.. వారి ఆశీస్సులు తీసుకోవటం ద్వారా.. సీనియర్లను తాము పక్కన పెట్టేయలేదన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో పక్కన పెట్టేసిన సీనియర్ నేతల్ని రాజ్యసభకు ఎంపిక చేయటం ద్వారా.. తమకొచ్చిన చెడ్డపేరును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. రాజ్యసభకు ఎంపిక చేస్తామన్న మోడీషాల మాటకు వారెలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.
No comments:
Post a Comment