సర్పంచ్ లకు చెక్ పవర్ కల్పించే సమస్యపై వారం రోజులలో పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు.రాష్ట్రంలోని 12771 మంది గ్రామ సర్పంచులకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని అందుకోసం ఆర్డినెన్స్ జారి చేయాలని నేడు తో చర్చలు జరిపారు నేను బీసీ సంక్షేమ సంఘం నాయకులు సచివాలయంలో మంత్రిని కలిసి చర్చలు జరిపారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టి సవరణలు చేయడానికి జాప్యం జరుగుతుందని, ఈలోగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలు స్తంభించి పోతాయని కృష్ణయ్య మంత్రి దృష్టికి తెచ్చారు.
వారం రోజులలో సర్పంచ్ ల చెక్ పవర్ సమస్య పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి స్పందిస్తూ తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుపుతామని, సమావేశాల అనంతరం ముక్య మంత్రి నిర్ణయం తెసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.5 నెలలు ఆగిన వారు 8 రోజులు ఓపిక పడితే చాలు అన్నారు.గ్రామ పంచాయితి ఎన్నికలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తుంది. కాని గ్రామాభివృద్ది – ఇతర కార్యక్రమాలు చేపడుదామంటే సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. పంచాయత్ రాజ్ చట్ట సవరణ తర్వాత చెక్ పవర్ ఇస్తామని మంత్రి నిన్న ప్రకటించారు. చట్ట సవరణ జరగడానికి సమయం పడుతుంది. ఈ లోగా ఆర్డినెన్స్ జారీ చేసి చెక్ పవర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
No comments:
Post a Comment