Breaking News

14/06/2019

సర్కారు బడులన్నీ ఇంగ్లీషు మీడియంలో

తాడేపల్లి, జూన్ 14 (way2newstv.in) 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తీసుకువస్తానని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన రాజన్న బడి బాట సామూహిక అక్షరాభ్యాసం కార్యమానికి హజరయిన ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్నారు.  ఖర్చులను భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను నా కళ్లారా చూశా. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తామని దృఢ సంకల్పంతో చెప్పాను. .ఆ మాటను నేడు నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.  జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఒక పండుగ దినం చేస్తానన్నారు. 


సర్కారు బడులన్నీ ఇంగ్లీషు మీడియంలో
ప్రతి తల్లి చేతికి రూ.15,000 డబ్బులు అందిస్తానన్నారు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 26 % చదువు లేని వారుంటే.. ఇక ఏపీలో 33% మంది చదువు లేనివారు ఉండటం బాధాకరమన్నారు. విద్యార్థులు సరైన సమయంలో పుస్తకాలు, యూనిఫాంలు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులున్నాయన్నారు. పాఠశాలల్లో త్రాగునీరు, బాత్రూంలు, ప్రహరీ గోడలు, ఫర్నిచర్ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలల్లో ఇలా ఉంటే తల్లిదండ్రులు పిల్లలను బడులకు ఎలా పంపిస్తారని .?, నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు పాఠశాలల్లో ఎల్ కేజీకే రూ.20వేల పై చిలుకు ఫీజులున్నాయన్నారు.  రాష్ట్రంలో 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలున్నాయని, రెండేళ్లలో వాటి రూపు రేఖలను మార్చే విధంగా కృషి చేస్తానన్నారు. నిరక్షరాస్యత రేటు విషయంలో భారతదేశం సగటుతో పోల్చుకుంటే ఏపీ ఇంకా దిగువన ఉందని జగన్  చెప్పారు ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావాలన్నారు. తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేస్తానన్నారు. 

No comments:

Post a Comment