Breaking News

28/06/2019

ఖరీఫ్ కు కష్టాలేనా


విజయవాడ, జూన్ 28, (way2newstv.in)
తాంగానికి అనేక ఒడిదుడుకులతోనే ఖరీఫ్‌ ప్రారంభమవుతోంది. గత సీజన్‌లో పంట దిగుబడులు తగ్గడం, ఖర్చులు పెరగడం, నీటి సమస్యతో రైతాంగాన్ని వెంటాడుతూనే వున్నాయి. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌ను రైతాంగం ఆశాజనకంగా ప్రారంభించలేకపోతున్నారు. భూములు దుక్కులు దున్ని ఖరీఫ్‌ పంటలు వేసేందుకు సిద్ధపడినప్పటికీ వర్షాలు 15 రోజులపాటు ఆలస్యమవ్వడంతో ఈసారి సాగయినా సక్రమంగా సాగుతుందా, పంటలు చేతికివచ్చేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం ఆడవాళ్ల కూలి రోజుకు రూ.150, ఆటో ఖర్చులతో కలిపి అవుతుండగా మగవాళ్ల కూలి రూ.600 వరకు పలుకుతుంది. దీంతో ఉత్సాహంగా సాగుచేసేందుకు కౌలు రైతులు ముందుకురావడంలేదు. దీనికితోడు ఎరు వుల, పురుగుమందుల ధరలు కూడా పెరుగుతాయనే సమాచారం రైతులను మరింత కుంగదీస్తుంది. ప్రతి సంవత్సరం జూన్‌ మొదటివారంలోనే బోరుల కింద వరినారుమళ్లు పోసేవారు. మూడవ వారం లో పెసర, మినుము, కంది లాంటి అపరాల సాగుపంటలను విత్తుకునేవారు. ఈసంవత్సరం జూన్‌ మూడవ వారం వచ్చినా బోర్ల కింద నారుమడులను పోయడం ఇంకా ప్రారంభించలేదు. 

ఖరీఫ్ కు కష్టాలేనా


కొద్దిమంది రైతులు దుక్కులు దున్ని చదునుచేసి సాళ్లుతోలి పత్తి విత్తనాలు విత్తేందుకు ఆకాశంవైపు చూస్తున్నారు. గత రెండు, మూడు రోజుల నుండి చిరుజల్లులే తప్పా దబాటు వర్షాలు పడకపోవడంతో విత్తనాలు విత్తేందుకు వెనకాడుతున్నారు. కాగా కొంతమంది రైతులు వచ్చేపోయే చినుకుకు మొలవకపోతుందా అనే ఆశతో పొడినేలలోనే పత్తి విత్తనాలు పెట్టి పొడికప్పు కప్పుతున్నారు. కాగా మండలంలోని చాలా గ్రామాలలో భూముల కౌలు రేట్లు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఊటుకూరు, గాదెవారిగూడెం, ఆర్లపాడు, పెనుగొలను, తునికపాడు, దుందిరాలపాడు, గంపలగూడెం వంటి గ్రామాలలో నీటివసతి ఉండి మిరపతోట వేసే భూములకు గత సంవత్సరం ఎకరాకు రూ.30 వేలనుండి 40 వేల వరకు రేటు పలకగా, ఈసంవత్సరం రూ.25 వేలనుండి రూ.30 వేలవరకు మాత్రమే కౌలు చెల్లించేందుకు కౌలు రైతులు ముందుకువస్తున్నారు. అలానే నీటివసతిలేని పత్తి వేసే భూములకు ఎకరాకు రూ.20 వేల నుండి 25 వేల వరకు రేటు పలకగా ఈసంవత్సరం రూ.15 వేలనుండి రూ.20 వేలవరకు కౌలు రేట్లు పలుకుతున్నాయి. దీనికితోడు మండలంలో ప్రభుత్వం నిషేధించిన గైసెల్‌ రకం బిటి-3 విత్తనాలు గ్రా మాలలో నేరుగా రైతుల వద్దకే వచ్చి విక్రయిస్తున్నట్లు వినికిడి. మామూలు బిటి-2 విత్తనాలు ప్యాకెట్‌ రూ.875 ధర పలుకుతుండగా, ఈవిత్తనాలను రూ.1200ల చొప్పున ఇళ్ల వద్దకే వచ్చి రైతులకు అంద చేస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ఈరకం పత్తిలో కలుపుమందు కొడితే పత్తిచెట్లకు ఎటువంటి నష్టం కలగకుండా ఏపుగా పెరుగుతాయని, కలుపు, అంతరకృషి ఖర్చులు లేకుండానే పత్తిసాగుచేసే ఆస్కారం ఉండటంతో రైతులు ఆమేరకు ఖర్చుతగ్గుతుందని బిటి-3 విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారు.మండలంలో పలు విత్తనాలు షాపులలో ముతకల రకాలయిన 1061, 2077 తదితర ముతకరక విత్తనాల కొరత ఏర్పడింది. 5204 సూపర్‌ఫైన్‌ రకం (సాంబమసూరు) మాత్రమే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో రైతులు సాంబమసూరు రకాన్నే నారుపోసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం మండలంలో మిరపసాగు కొద్దిగా తగ్గి ఆమేరకు పత్తిసాగు పెరుగుతుందని వ్యవసాయా ధికారులు అంటున్నారు. సుమారు 500 ఎకరాల మేర మిరపసాగు విస్తీర్ణం తగ్గి ఆమేర పత్తిసాగు పెరు గుతుందన్నారు.

No comments:

Post a Comment