Breaking News

16/05/2019

దేవాదాయ భూముల కౌలు వేలాన్ని బహిష్కరణ

నంద్యాల మే 16  (way2newstv.in)
ఆళ్లగడ్డ మండలం లో నల్లగట్ల గ్రామంలో గురువారం నాడు దేవస్థానం అధికారులు దేవస్థానం పరిధిలో ఉన్న భూములను కౌలుకు వేలం వేయాలని నిర్ణయించారు. ఊరి ప్రజలు వేలాన్ని అడ్డుకోని అధికారులను వెనక్కి పంపించారు . ఆళ్లగడ్డ మండలం లో నల్లగట్ల గ్రామంలో సుమారు 90  ఎకరాల దేవస్థానం ఆధ్వర్యంలో భూమి వుంది. ప్రతి సంవత్సరం కౌలు కింద. 9   లక్ష ల రూపాయలు దేవస్థానం అధికారులకు కౌలు ద్వారా ఆదాయం వస్తుందని. ప్రజలు ఆరోపిస్తున్నారు. 


దేవాదాయ భూముల కౌలు వేలాన్ని బహిష్కరణ

గ్రామంలో దేవాలయాలు అధ్వానంగా వున్నాయని. దేవాలయాల. బాగోగులు అధికారులు పట్టించుకోవడం  లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం . కౌలు కింద వచ్చిన డబ్బులకు అధికారులు లెక్కలు చెప్పడం లేదని గ్రామస్తులు ఆంటున్నారు. కనీసం మేము ఇస్తున్న కౌలు డబ్బులతో నైనా దేవాలయాలు బాగు చేయించాలని పలువురు భక్తులు ప్రజలు కోరుతున్నారు. ఈ సంవత్సరంలో దేవస్థానం భూములను ఎవ్వరు కూడా కౌలు వేలానికి పాడ కూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని  సమాచారం.

No comments:

Post a Comment