Breaking News

16/05/2019

స్వంత అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్న చంద్రబాబు : దత్తాత్రేయ

హైదరాబాద్ మే 16  (way2newstv.in)
ఈ నెల 23 న  యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు యుపిఏ పార్టీలను ( మహాకూటమి ) మరియు ప్రతిపక్ష పార్టీలను సమైక్యపర్చి, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకుండా అడ్డుకోవడానికి సమావేశం నిర్వహించడం పచ్చి అవకాశవాదమని ఎంపి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు.ఎన్నికల ముందు ఉత్తర్ ప్రదేశ్ లో, ఆంధ్ర ప్రదేశ్ లో, కేరళ లో మరియు పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాలలో కలిసి పోటీ చేయని పార్టీలు ఇప్పుడు కలుస్తారనేది కలెగూరగంప అని ఎద్దేవా చేసారు.మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ పేరుతొ అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతుండగా, ఇంకోవైపు కమ్యూనిస్టు పార్టీలు యుపిఏ వైపు ఉండాలో, ఫెడరల్ ఫ్రంట్ వైపు ఉండాలో తేల్చుకోలేక సందిగ్ధం లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.


స్వంత అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్న చంద్రబాబు : దత్తాత్రేయ

కాంగ్రెస్ సీనియర్ నాయకులూ గులాం నబీ అజాద్ ప్రధాన మంత్రి అభ్యర్ధి ఎవ్వరైనా పరవాలేదని వ్యాఖ్యానించడంతో రాహుల్ గాంధీ వారి ప్రధాన మంత్రి అభ్యర్ధి కారని అంగీకరించడం సంతోషకరం. ఆలస్యమైనా ఇది తెలివైన వ్యాఖ్యానం గా దత్తాత్రేయ అభివర్ణించారు.అసలు కాంగ్రెస్ పార్టీ 80 నుండి 100 సీట్లు సాధించడం గగన మన్నారు.చంద్రబాబునాయుడు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, ఆయనది పరిమిత పాత్ర. తన స్వంత అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్నారు తప్ప ఆయన కింగ్మేకర్ గాని , నిర్ణయాత్మక శక్తిగా ఉండే అవకాశమే లేదన్నారు.ఈ నెల 19 వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ప్రతిపక్షాలు మరియు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఎందుకు ఇంత తహతహలాడుతున్నాయి? విశ్లేషణ రాకముందే వారు నిర్దారించుకోవడం ఎలా ఉందంటే 'ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా ఉందన్నారు.కేంద్రంలో హంగ్ వస్తుందని, తాము నిర్ణయాత్మక శక్తిగా ఈ టిఆర్ఎస్ అధ్యక్షులు కెసీఆర్ పర్యటనలు వృధా ప్రయాసగానే మిగిలిపోతాయి.  కెసీఆర్ గారు క్రికెట్ ఆట మొదలవకముందే (తమిళ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాలు) రెండు వికెట్లు కోల్పోయారు.నరేంద్ర మోదీ , బిజెపి కి మరియు ఎన్డిఏ కి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరిగింది. ఈ కూటమి ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించింది. బిజెపి స్వంతంగా మెజారిటి సాధిస్తుంది. ఎన్డిఏ మరింత బలోపేతమౌతుంది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం. దేశాభివృద్ధికి, దేశ రక్షణకు, దేశ సమైక్యతకు ప్రాముఖ్యతనిస్తుంది. పేదలకు, రైతులకు, బడుగు బలహీనవర్గాలందరికి సమ్మిళిత అభివృద్ధి  తో శక్తివంతంగా పరిపాలిస్తారు అవినీతిపరులు మరియు అక్రమంగా సంపాదించిన వారి భరతం పడతారని దత్తాత్రేయ హెచ్చరించారు.

No comments:

Post a Comment