Breaking News

16/05/2019

వైద్య రంగంలో నర్సుల పాత్రకు వేలం కట్టలేం

ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. రాములు.
నిజామాబాద్  మే 16:  (way2newstv.in)
వైద్య రంగంలో నర్సుల పాత్ర చాలా కీలకం దానిని వేలం కట్టలేమని వారి సేవలు ఉత్తమమైనవని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. రాములు ఆన్నారు. బుధవారం ఫ్లొరెన్స్ నైటింగేల్ జయంతి  ఉత్సోవాల భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ .రాములు హజరై నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో విశిష్ట సేవలు అందించిన పలువురు నర్సులను ఘనంగా సన్మానించారు. 


వైద్య రంగంలో నర్సుల పాత్రకు వేలం కట్టలేం

ఆసుపత్రిలో విశిష్ట సేవలు అందిస్తున్న అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పార్వతి, ఇంచార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్ శోభతో పాటు 10 మందికి శాలువా,పూలమాలలతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఆనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల పాత్ర చాలా కీలకమని, వారి సేవలు ఉత్తమమైనవని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కొరకు 270 నర్సుల అవసరం ఉండగా సిబ్బంది కొరత కారణంగా 100 మంది నర్సులు  సేవలు అందిస్తున్నారని, వారి సేవాతత్పరత అమూల్యమైనదని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరిండెంట్ ప్రతిమా రాజు ,ఆర్.ఎం.ఓ ఫరీదా, వైద్యులు గోపాల్, అర్జున్ శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment