ములుగు జిల్లాలో అర్హులైన ప్రతి వికలాంగునికి సకాలంలో దృవీకరణ పత్రం అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సదరన్ క్యాంపు ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసుకున్నా ములుగు జిల్లాలో వికలాంగులు తాము పింఛన్ పొందుటకు ఇచ్చే ధ్రువీకరణ పత్రం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ, డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో కొత్తగా మెడికల్ బోర్డు ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
సదరన్ క్యాపు ప్రారంభించిన ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందులో కంటి, చెవి, ముక్కు, మానసిక, ఫిజియోథెరపీ, ఎముకలకు సంబంధించిన వైద్య నిపుణులు సభ్యులుగా ఉంటారని అన్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వికలాంగులు తమకు సర్టిఫికెట్ కాల పరిమితి అయిపోయి నందున పెన్షన్ రావడం లేదని దరఖాస్తు లు చేసుకుంటున్నారని ఇక నుంచి అలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో వికలాంగుల కోసం ప్రత్యేకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతి నెలలో రెండవ, నాలుగవ శుక్రవారాలలో వికలాంగులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment