జయశంకర్ భూపాలపల్లి మే 6, (way2newstv.in)
జిల్లాలోని గణపురం మండలం ఎంపీడీవో కార్యాలయం అవరణలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్నికల ఏర్పాట్ల కోసం వేసిన టెంట్లవద్ద షాట్ సర్కూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఎన్నికల ఏర్పాట్లలో అగ్నిప్రమాదం..
పెద్ద ఎత్తునే ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు, కుర్చీలు, టెంటు సామాగ్రి కాలి బూడిదైపోయాయి. ఘటనకు దగ్గరలో వున్న ఒక చెట్టు కుడా తగలబడిపోయింది. టెంట్ వద్ద ఉన్న కారు పాక్షికంగా దగ్గమయింది.
No comments:
Post a Comment