ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహబూబ్ భాష
తుగ్గలి మే 6, (way2newstv.in)
పవిత్ర రంజాన్ మాసంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డోన్ డిఎస్పి ఖాదర్ బాషా కు ముస్లిం హక్కుల పోరాట సమితి పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొందిమడుగుల మహబూబ్ బాషా వినతి పత్రం అందజేశారు.
రంజాన్ మాసంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు
రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని మసీదులు మరియు మసీద్ పరిసర ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డోన్ డీఎస్పీ కు వినతి పత్రం అందజేశారు.ఉపవాస దీక్ష సమయంలో రాత్రిపూట హోటల్స్ కు మరియు తోపుడుబండ్ల కు అనుమతి ఇవ్వాలని డీఎస్పీ కు తెలియజేశారు.అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని మసీదుల కమిటీని ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు మరియు సలహాలు ఇవ్వాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం ఎమ్.హెచ్.పి.ఎస్ సమితి సభ్యులు కాసిం వలి మరియు లాలు పీరా పాల్గొన్నారు..
No comments:
Post a Comment