Breaking News

06/05/2019

ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్న ప్రతిపక్షాల పార్టీలు

వరంగల్,  మే 6, (way2newstv.in
రాజకీయ పార్టీలు రానురానూ సేవలు మరిచి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. దాదాపు 25 ఏళ్ల క్రితం వరకు ఒకటి రెండు పార్టీలు మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలు ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా రెండు పార్టీల్లో ప్రజలు ఎవరో ఒకరిని గెలిపించేవారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బానిసలుగా మారిన ప్రజలు అధికార పక్షాన్నే ఆదరిస్తూ ప్రతిపక్ష పార్టీలను బండకేసి కొడుతున్నారు. అదే గత అసెంబ్లీ ఎన్నికల్లోనైనా... నిన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలైనా ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఈ రెండు ఎన్నికల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 475 పంచాయతీలకుగాను 309 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా కాంగ్రెస్ 127, టీడీపీ 2, బీజేపీ 4 ఇతరులు మిగిలిన స్థానాల్లో గెలిచారు. అలాగే ఎన్నికల్లో డబ్బులే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 


ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్న ప్రతిపక్షాల పార్టీలు

తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం టీఆర్‌ఎస్ మినహా ప్రతిపక్షాలు ఒక్కో ఓటుకు వేలకు వేలు ఇచ్చి కొనుగోలు చేసి గెలుపొందుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున బరిలో దిగిన తెలంగాణ ఉద్యమ కారులు డబ్బులు ఖర్చు చేయకుండానే తెలంగాణ తెచ్చిన పార్టీ అని ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన విషయం విదితమే. అయితే తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ 2014 వరకే ఉంటుంది తప్ప మళ్లీ ఎన్నికల సమయానికి ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ విజయాలను మూటకట్టుకున్నారు. గతంలో మాదిరి ఎవరికో ఒకరికి ఓటు వేయాలనేది కాకుండా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏది మంచి.. ఏదిచెడు.. ఏ ప్రభుత్వ పాలన ఎలా ఉంది.. తమకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది ఓటు వేసేకంటే ముందే నిర్ణయించుకుంటున్నారు. అం దుకే అధికార టీఆర్‌ఎస్‌కు విజయాలు.. ప్రతిపక్షాలకు పరాజయాలు దక్కుతున్నాయి.వరుస విజయాలతో సంతోషంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు పరిషత్ ఎన్నికల్లో సైతం ప్రజలు ఘన విజయం కట్టబెట్టి ప్రతిపక్షాలకు చుక్కలు చూపించడం ఖాయమని అధికార పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో మూడు విడుతలుగా జరుగబోయే ఈ ఎన్నికల్లో తొలి, రెండో విడుతల ప్రచారం షురూ కాగా మూడో విడుత మండలాల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. కాగా గ్రామ గ్రామాన ఎంపీటీసీ, జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుండగా ప్రతిపక్షాల జాడే కనిపిస్తలేదు.

No comments:

Post a Comment