Breaking News

17/05/2019

పాలమూరు లో భూములకు రెక్కలు

మహబూబ్ నగర్, మే 17, (way2newstv.in)
పాలమూరుజిల్లాలో భూములధరలు చుక్కలనంటుతున్నాయి. కొత్తజిల్లాల ప్రతిపాదనలతో పలు పట్టణాల్లో రియల్‌బిజినెస్‌ ఊపందుకుంది. అమ్మకాలు కొనుగొళ్లతో రిజస్ట్రార్‌ ఆఫీసులు సందడిగా మారాయి.కరవుజిల్లా పాలమూరులో భూములధరలకు రెక్కలొచ్చాయి.  ఏకంగా రెండు నెల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం మూడు కోట్లు చేరింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఎగబడడంతో వ్యవసాయ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి..డబ్బున్న పెద్దోళ్లు భూముల్ని ఎగబడికొంటున్నారు.జిల్లాల పునర్విభజన కారణంగా నాగర్‌ కర్నూలు, వనపర్తి పట్టణాల్లో ఎపుడూలేని విధంగా ల్యాండ్‌రేట్లు ఆకాశాన్నంటాయి. 


పాలమూరు లో భూములకు రెక్కలు

గజం భూమి వేలల్లో పలుకుతోంది. గతంలో గజం 4నుంచి 5వేల రూపాయలు ఉండగా... కొత్త జిల్లాప్రతిపాదనతో నాగర్‌కర్నూలు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం గజం ధర ఏకంగా 20 నుంచి 40వేల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రెండు నెలల్లో భూవిక్రయాల ద్వారా సబ్‌రిజిస్ట్రార్‌ క్యార్యాలయాలకు ఏకంగా 3కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వచ్చిందంటే ..జిల్లాలో ల్యాండ్‌ బూమ్‌ ఎంతలా ఉందో అర్థమవుతోంది. అటు వనపర్తికూడా జిల్లాకేంద్రంగా మారుతుందన్న ప్రచారంతో రియల్‌వ్యాపారులు జోరుపెంచారు. వనపర్తితోపాటు పెబ్బేరు, కొత్తకోట, గోపాల్‌పేట వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈప్రాంతాల్లో ఎకరం పొలం 10లక్షల రూపాలకు పైమాటే అంటున్నారు స్థానికులు. సందట్లో సడేమియలా..కొందరు ప్రభుత్వభూములను కూడా ప్లాట్స్‌ మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు సైలెంట్‌ అయ్యారనే ఆరోపణలొస్తున్నాయి.అటు రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న షాద్‌నగర్‌లో అయితే వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. పట్టణం చుట్టుపక్కల కిలోమీటర్ల పర్యంతం వెంచర్లు వెలిశాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, దళారులు..కోట్లరూపాయలు జేబుల్లో నింపుకుంటున్నారు..

No comments:

Post a Comment