Breaking News

17/05/2019

వెలవెల బోతున్న పాలేరు రిజర్వాయర్

ఖమ్మం, మే  17, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుల్లో అది ఒకటి. ఖమ్మం జిల్లాకే తలమానికమది. రూ.2.5లక్షల ఎకరాల సాగు అందిస్తున్న రిజర్వాయర్‌ అది. 101 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా నీరు సరఫరా చేసే అతిపెద్ద చెరువు. కానీ నేడు అది ఎండిపోతుంది. అదేదో కాదు ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలో ఉన్న పాలేరు రిజర్వాయర్‌. వర్షాకాలం వచ్చిందంటే గలగలపారే నీటితో పొంగిపొర్లె అలలతో సముద్రాన్ని తలపించే విధంగా ఉండే పాలేరు రిజర్వాయర్‌ అడుగంటిన పరిస్థితికి చేరుకుంది. 23 అడుగుల పూర్తిస్థాయి సామర్య్థం కలిగిన పాలేరు రిజర్వాయర్‌ 8.1 అడుగులకు పడిపోయి వెలవెలపోతుంది. 


వెలవెల బోతున్న పాలేరు రిజర్వాయర్

గత ఏడాది ఆగస్టు నెలలో 18 అడుగులతో ఉన్న పాలేరు రిజర్వాయర్‌ మరో రెండు అడుగులకు పడిపోతే డెడ్‌స్టోరేజీకి చేరువై తాగునీరు కూడా అందించలేదని స్థితికి చేరుకుంటుంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఈ ఏడాది జిల్లాలో నిండుగా వర్షాలు పడుతుంటే పాలేరు నియోజకవర్గంలో మాత్రం వర్ష సూచన కనిపించలేదు. మోస్తారు వర్షం వచ్చి భూమి తడిసిపోతుంది తప్ప వరదలు వచ్చే వర్షాలు పడకపోవడం దురదుష్టకరం. దీంతో పాలేరు జలాశయంలో చుక్కనీరు లేదు. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి ఈ ఏడాది నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పాలేరు రిజర్వాయర్‌ ఎండిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆగస్టులో నాగార్జునసాగర్‌ నుంచి పాలేరు జలాశయం, పాత, పెద్ద కాల్వల ఆయకట్టు రైతులు జోరుగా నాట్లు వేసుకొనే పరిస్థితి ఉండేది. కానీ రిజర్వాయర్‌లో నీరు అడుగంటడంతో ఇప్పటి వరకు వరిసాగు ప్రారంభం కాలేదు. తద్వారా సాగర్‌ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి పాలేరు జలాశయం రిజర్వాయర్‌ 8.1 అడుగులకు పడిపోవడంతో గత 30 ఏండ్ల చరిత్రలో ఇదే మొదటి సారి అని ఆయకట్టు రైతులు చర్చించుకోవడం గమనార్హం. ప్రస్తుతం రిజర్వాయర్‌ కింద అపరాలు సాగు చేశారు. బోర్ల కింద మాత్రమే వరి పంట సాగు చేశారు

No comments:

Post a Comment