Breaking News

17/05/2019

సిటీలో డబుల్ డైలామా

హైద్రాబాద్, మే 17, (way2newstv.in)
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం డైలమాలో పడింది. ఇళ్ల నిర్మాణంలో స్పష్టత రావడం లేదు. ఎన్ని అంతస్తులు నిర్మిం చాలనే విషయంలో డైలమా నెలకొంది.గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు లభించడం లేదు. స్థలాల లభించకపోవడంతో జిహెచ్‌ఎంసి అధికారులు జి+3, జి+5, జి+9, జి+14 అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. శంకుస్థాపన చేసిన 18 బస్తీల్లో స్థానికుల అంగీకారంతో జి+3, జి+5, జి+9, జి+14 అంతస్తులకు సంబంధించి, 5 వేల ఇళ్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో ఉన్నాయి. అత్యధిక మురికివాడల వాసులు తమకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిరాకరిస్తున్నారు. ఇండిపెడెంట్, లేదా రెండు, మూడు అంతస్తుల్లోనే నిర్మించాలని పట్టుబడుతున్నారు. మురికివాడల్లో మూడు నుంచి ఐదు అంతస్తుల్లో నిర్మించాలని ఇటివల కెటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


సిటీలో డబుల్ డైలామా 

మురికివాడల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉంటే, స్థలం తక్కువ ఉండటంతో భవనాలకు సెట్‌బ్యాక్ వీడాల్సి ఉంటుంది ఇళ్ల నిర్మాణంలో పలు అంశాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించాల్సి ఉంది. 40 అడుగుల సెట్‌బ్యాక్, 30 అడుగులకు మినహాయింపు, అగ్నిమాపక శాఖ నిబంధనల్లో కూడా మినహాయింపు, ఎయి ర్‌పోర్టు అథారిటీ నిబంధనలు కూడా ఉండటంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం విషయంలో పరిస్థితి గందర గోళంగా మారింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిహెచ్ ఎంసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ నిర్ణయం తీసు కుంటే తప్ప డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్ణయం అనంతర మే ఇళ్ల నిర్మాణాన్ని జిహెచ్‌ఎంసి చేపట్టేందుకు వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకున్న విషయం తెల్సిందే. ప్రయోగత్మకంగా సికింద్రాబాద్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీలో 396 ఇళ్లను నిర్మించారు. వీటిని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబ్దిదారులకు అందచేశారు. ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన విధంగానే నగరంలో రెండు లక్షల ఇళ్లను నిర్మిస్తామని మునిసిపల్ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ హామీనిచ్చింది. అందులో భాగంగా జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు 18 ప్రాంతాల్లో మునిసిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు వీటికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణా ప్రక్రియ ఎంత వేగంగా సాగిందో ఎన్నికలు ముగిసిన అనంరతం అదే స్థాయిలో జాప్యంగా సాగుతోంది. ప్రభుత్వ శాఖల నిబంధనలు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు వేస్తున్నాయి.40 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు వెడల్పు ఉండాలని టౌన్‌ప్లానింగ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా జి+5, 9, 14 అంతస్తులు నిర్మిస్తే అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం బహుళ అంతస్తు ల్లో అగ్నిమాపక నిరోదక చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తప్పనిసరిగా సెట్‌బ్యాక్‌లు వదలాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నిబంధనల్లో కూడా మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. మురికివాడల్లో నిర్మించే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను టౌన్‌ప్లానింగ్, అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్మించే పరిస్థితులు ఉండవు. దీంతో టౌన్‌ప్లానింగ్ నిబంధనల్లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల కోసం 40 సెట్‌బ్యాక్‌ను 30 అడుగులకు తగ్గించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందచేశారు.బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 18 మీటర్ల ఎత్తు దాటితే ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు తప్పనిసరి అవుతుంది. ఐదు అంతస్తులు దాటితే ఎయిర్‌పోర్టు అనుమతులు తీసుకోవాల్సిందే. ప్రమాణాల ప్రకారం భవనాలు నిర్మిస్తేనే ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు మంజూరు చేస్తుంది. నిబంధనల్లో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే విషయంలో ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిబంధనల్లో మినహాయింపులు ఇచ్చినా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు మంజూరు చేస్తుందా? లేదా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం డైలామాలో పడింది

No comments:

Post a Comment