Breaking News

06/05/2019

సెకండ్స్...బిజినెస్..అదరహో....

హైద్రాబాద్, మే 6, (way2newstv.in)
ప్రతీ ఏటా సెకండ్ హ్యాండ్ వాహనాలు పెరుగుతున్నాయి. 2015-16 నుంచి సరాసరిన 2 లక్షల వాహానాలు విక్రయాలు సాగితే.. 2018-19  నాటికి దాదాపు రెట్టింపు అయింది. సెకండ్ హ్యాండ్ కార్లకు బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తుండటంతో పెద్ద ఎత్తున కార్లను స్వంతం చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్ల ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా ఈ రంగంలోకి దిగడానికి ఇదే కారణమని చెప్పాలి.ఈ వ్యాపారంలో కార్ల ఉత్పత్తి కంపెనీలు కూడా దిగాయి. సెకండ్ హ్యండ్ కార్లంటే ఏదో మారుతి 800 వంటి కార్లే కాకుండా బెంజ్, బీఎండబ్ల్యూ వంటి హైఎండ్ కార్లు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. యాక్ససెరీస్ కూడా అదనంగా పాత కార్లలో కలిసి వస్తాయి. ఓఎల్‌ఎక్స్, మార్కెట్ ప్లేస్ వంటి వెబ్‌సైట్లలో కూడా అమ్మకాలు జరుగుతుండటంతో విక్రయాల సంఖ్య లక్షల్లో జరుగుతున్నది. ఈ వ్యాపారంలో వస్తున్న లాభాలను చూసి హైదరాబాద్ వంటి నగరంలో ఏరియాకో సెకండ్ సేల్ ఏజన్సీలు ఏర్పాటయ్యాయి. 


సెకండ్స్...బిజినెస్..అదరహో....

మాదాపూర్, మియాపూర్, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్ వంటి ప్రాంతాల్లో కలిసి నగరంలో నెలకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాల అమ్మకాలు జరుగుతున్నట్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్ల తయారీ దారులు చెబుతున్నారు. ఇంతేకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వాహనాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. మార్కెట్లో వస్తున్న లాభాలపై కన్నేసిన ప్రముఖ కంపెనీలు ఈ బిజినెస్‌లో దిగాయి. సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసిన వారికి రుణ సదుపాయంతోపాటు ఆఫర్లు కూడా ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎక్సెంజీ ఆఫర్ కింద కొత్త వాహనాలను అమ్ముకుంటూ పాత వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మకానికి ఉంచి రెండు రకాలుగా లాభాలార్జిస్తున్నాయి. 17 ఏండ్ల కిందటే మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ పేరుతో అవుట్ లెట్లు తెరిచింది. మహీంద్రా చాయిస్‌వీల్స్ పేరుతో హ్యుందాయ్ హెచ్ ప్రామీస్ పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్‌లో అడుగుపెట్టి దేశ వ్యాప్తంగా అవుట్ లెట్లను తెరిచి అమ్మకాలు సాగించాయి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలకు సంబంధించి పట్టణాల్లో గల్లీకొకటి చొప్పున వెలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 25 వేలకు మించితే ఆటోమొబైల్ డీలర్షిప్ షోరూంల సంఖ్య దేశ వ్యాప్తంగా 2 వేలకు మించడం లేదు. ఒకప్పుడు 8 ఏండ్లు నడిపితే కారు మార్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 6 సంవత్సరాలకు కుదించబడగా భవిష్యత్తులు ఇది మూడున్నరేండ్లకు రానుందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.సెకండ్ హ్యాండ్ సేల్స్‌లో కార్లే కాకుండా బైకులు కూడా పెద్ద ఎత్తున అమ్ముడు పోతున్నాయి. విక్రయదారులు వీటికి కూడా ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తుండటంతో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. షోరూం ధరతో పోలిస్తే 2 సంవత్సరాల బైక్ లేదా స్కూటర్‌కు 20 నుంచి 22 వేల వరకు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment