Breaking News

13/05/2019

నజరానా ఏదీ.. (నల్గొండ)

నల్గొండ, మే 23 (way2newstv.in): 
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పల్లె ప్రజలు స్పందించారు. ఏకగ్రీవమైతే ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు మరికొన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాలను ఓటర్లు గమనంలోకి తీసుకున్నారు. ప్రోత్సాహకం మొత్తం గ్రామాభివృద్దికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా సర్పంచులు, వార్డు సభ్యులను ఎన్నుకుని స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలో జిల్లాలో 63 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.నిధుల లేక పరిష్కారం కాని సమస్యలు గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులుండాలి. ఆదాయ మార్గం ఉంటేనే నిధుల కొరత ఉండదు. మైనర్‌ పంచాయతీల విషయానికొస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండడం, ఆదాయ వనరులు లేకపోవడం లాంటివి చిన్న పంచాయతీల పాలిట శాపంగా మారుతోంది. 


నజరానా ఏదీ.. (నల్గొండ)

14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అందుతున్న నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుండడంతో చిన్న గ్రామాలకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. కనీసం వీధిదీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లదీస్తుండేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే ఏకగ్రీవమే ఉత్తమమని గుర్తించిన గ్రామస్థులు వాటిద్వారా వచ్చే ప్రోత్సాహానికి ఎదురు చూస్తున్నారు. ఏకగ్రీవమైతే రూ.10లక్షలతో పాటు మరో రూ.5లక్షలు తమ కోటా నుంచి ఇస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. ఆ మాటలు నమ్మి ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరి మూడు నెలలు పూర్తయింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను విడుదల చేస్తే గ్రామాలలో సమస్యల పరిష్కారానికి పనులు చేపట్టడానికి వీలవుతుంది. సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణాలు, చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం గతంలో మాదిరిగా ఆలస్యం చేకుండా వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచులు, ప్రజలు కోరుతున్నారు.చౌటుప్పల్‌, మోత్కూరు మండలాల పరిధిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ, ఆలేరు, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు, రామన్నపేట, యాదగిరిగుట్ట మండలాల్లో రెండు చొప్పున, అడ్డగూడూరు, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో మూడేసి గ్రామ పంచాయతీలు, భువనగిరి, రాజపేట, తుర్కపల్లి, గుండాల మండలాల పరిధిలో ఐదు గ్రామ పంచాయతీలు, బీబీనగర్‌, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల పరిధిలో ఆరు చొప్పున, బొమ్మలరామారం మండలంలో 7 చొప్పున పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 636 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment