Breaking News

27/05/2019

గత రెండు రోజులలో 1.91 లక్షల మందికి శ్రీవారి దర్శనం


తిరుమల, మే 27 (way2newstv.in)
వేసవి సెలవులు నేపధ్యంలో తిరుమల శ్రీవారిని మే 25, 26వ తేదీలలో 1.91 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.  ప్రస్తుతం తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుంది.  మే 25న శనివారం 92,184 మంది, మే 26న ఆదివారం 98,720 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠక్యూకాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి ఉద్యానవనాలలోని క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి విశేష సేవలందించాయి.  


గత రెండు రోజులలో 1.91 లక్షల మందికి శ్రీవారి దర్శనం
ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆలయంలో క్యూలైన్లను, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు స్బిబ్బందిని ఏర్పాటుచేశారు. గదుల వివరాలు ఎప్పటికప్పుడు  భక్తులకు తెలియచేశారు. నారాయణగిరి ఉద్యానవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు మరియు వైకుంఠం - 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేశారు. 

No comments:

Post a Comment