Breaking News

10/04/2019

వేగంగా కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

కడప, ఏప్రిల్ 10  (way2newstv.in)
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా భావిస్తోన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్‌లను కోర్టు అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. ఏప్రిల్ 4 నుంచి 8 వరకు పోలీసుల కస్టడీలో ఉన్న వీరు కీలక విషయాలను వెల్లడించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని, అతడి ఆదేశాల ప్రకారమే లక్ష్మి, రాజశేఖర్‌‌లు బెడ్‌ రూమ్‌లో రక్తపు మరకల్ని తుడిచారని పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. 


వేగంగా కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

పులివెందుల కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతేకాదు, బాత్‌రూమ్‌లో పడి ఉన్న వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఇనాయతుల్లా, ట్యాంకర్‌ బాషా, రాజశేఖర్‌‌లు బెడ్ రూమ్‌లోకి తెచ్చారని కృష్ణారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు పోలీసులు వివరించారు. మార్చి 15 తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంతో గంగిరెడ్డి, ప్రకాశ్‌లతోపాటు పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పులివెందుల కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని నిందితులను పోలీసులు విచారించారు. కోర్టు విధించిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నిందితులను కోర్టులో

No comments:

Post a Comment