Breaking News

10/04/2019

ఏపీ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్

న్యూ డిల్లీ ఏప్రిల్ 10 (way2newstv.in):
ఏపీ  హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిని  ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 1962లో జన్మించిన ఈయన 1983లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1986లో  లా కోర్సు పూర్తి చేశాడు. 1987 నుంచి అడ్వకేట్ గా అలహాబాద్ కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 


ఏపీ  హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ విక్రమ్ నాథ్

2004 సెప్టెంబర్ 24న హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో పర్మనెంట్ అయ్యారు.విక్రమ్ నాథ్ సర్వీస్ కాలం ఇంకా 2024 సెప్టెంబర్ 23వరకు ఉంది. ఇప్పటివరకు ఏపీ హైకోర్టు  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ విక్రమ్ నాథ్ తాజాగా నియమితులయ్యారు. 

No comments:

Post a Comment