Breaking News

20/04/2019

క్రాస్ ఓటింగ్ లో కన్ఫ్యూజన్

నెల్లూరు, ఏప్రిల్ 20, (way2newstv.in)
భారీ ఉత్కంఠ నడుమ జరిగిన ఎన్నికల ఫలితాలపై అంతకంటే భారీ సస్పెన్స్ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనే విషయంలో చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అనే అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పలు అనుమాానాలకు తెరలేపుతోంది. అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది కానీ క్రాస్ ఓటింగ్ అనేది అంత తేలికగా జరిగే వ్యవహారం కాదు. కొన్ని సందర్భాల్లో క్రాస్ ఓటింగుల్లో కన్ఫూజన్ నెలకొంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగిందని తెలుస్తుండటం రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ సారి ఏపీలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఒక విశ్లేషణ. ఈ విషయంలో ఓటర్లు ముందుగానే నిర్ణయాలు తీసుకున్నారని తమకు నచ్చినట్టుగా ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీ వారికి తాము వేయాలనుకున్న ఎంపీ అభ్యర్థికి మరో ఓటును వేయడానికి వారు ముందే ప్రిపేర్ అయిపోయారని మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి.


క్రాస్ ఓటింగ్ లో కన్ఫ్యూజన్

వివిధ సమీకరణాల లెక్కల ప్రకారం జనాలు ఆ నిర్ణయం తీసుకున్నారని.. అయితే ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ఒకే పార్టీకి వేయాలని చాలా మంది అనుకోలేదని వేర్వేరు పార్టీల వారీకే వేసేందుకు వారు మొగ్గు చూపినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా జనాలు నిర్ణయించుకున్నాకా.. పోలింగ్ బూత్ లకు వెళ్లగా అక్కడ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యిందనేది ఒక వాదన.అదేమిటంటే.. ఏది ఎంపీ ఎన్నికకు సంబంధించి ఈవీఎం, ఏది ఎమ్మెల్యే ఎన్నికకు సంబంధించిన ఈవీఎం అనేది జనాలకు అర్థం కాలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. పోలింగ్ బూత్ లలోకి వెళ్లగానే అక్కడ ఏది ఎంపీ ఓటుకు సంబంధించినది మరేది ఎమ్మెల్యే ఓటుకు సంబంధించినది అనేది తేల్చుకోవడం గ్రామీణ ప్రాంతాల వారీకి పెద్దగా అవగాహన లేని వారికి కష్టం అయ్యిందని అంటున్నారు. కేవలం గుర్తులను బట్టే ఓట్లు పడతాయని చెప్పనక్కర్లేదు. లెక్క ప్రకారం అయితే ముందుగా ఎంపీ ఎన్నికకు సంబంధించిన ఓటు వేయించాలి ఆ తర్వాత ఎమ్మెల్యే కి సంబంధించిన ఓటు వేయించాలి. అయితే ఈ విషయం కూడా పోలింగ్ కు ముందు చాలా మందికి తెలియదు. ఇక మరికొన్ని పోలింగ్ బూతులలో ఆ నియామాన్నే పాటించలేదు. ఏది ఎంపీ ఈవీఎం ఏది ఎమ్మెల్యే ఈవీఎం అనే బోర్డులు కూడా సరిగా లేవు. ఈవీఎంలను తెరిపరా చూసి.. అభ్యర్థుల పేర్లను గుర్తులను గమనించిన వారికే ఏ ఈవీఎం దేనికి అనేది పూర్తిగా అర్థం అయ్యింది.కొందరు ఓటర్లు అప్పటికే క్రాస్ ఓటింగ్ కు ప్రిపేర్ అయి వచ్చి లేని కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాకా.. పోలింగ్ సెంటర్ లో తలెత్తిన గందరగోళంతో వారు ఎలా పడితే అలా ఓటేశారని, ఇలాంటి ఓట్లే చాలా చోట్ల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని.. ఈ కన్ఫ్యూజన్ తో కొందరు అభ్యర్థుల జాతకం తారుమారు కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఎవరి భవితవ్యం ఎలా మారనేందో.

No comments:

Post a Comment