Breaking News

20/04/2019

న్యూట్రల్లో ఓటర్లు..దారెటు

విజయవాడ, ఏప్రిల్ 20, (way2newstv.in)
రాజకీయాలను నిర్దేశించేది పార్టీల అభిమానులు కాదు, సంప్రదాయ ఓటర్లు కాదు... ప్రతిసారి తమ అభిప్రాయం మార్చుకునే న్యూట్రల్ ఓటర్లు. వీరు ఎవరి వైపు ఉంటే వారిదే విజయం. మరి ఏపీలో వీరు ఎవరి వైపు ఉన్నారు?ఏపీలో ఇలాంటి వారు 21 శాతం ఉంటారని ఓ అంచనా.పొలింగ్‌కు కొద్ది రోజులు ముందు ఉన్న రాజకీయ వాతావరణాన్ని చూసి అప్పటి పరిస్థితులు ఆధారంగా వీరు ఓ నిర్ణయానికి వస్తారు. ఈసారి వివిధ సర్వే సంస్థలు న్యూట్రల్ ఓటర్స్ ఎటు అనే పాయింట్‌పై దాదాపు అన్ని సర్వేల్లో టీడీపీకి మెజార్టీ తటస్థులు మొగ్గు చూపారు. ఈ తటస్తుల్లో 90 శాతం మధ్యతరగతి వారే. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఇపుడు చూద్దాం.మధ్యతరగతి వారికి వైసీపీ ఆటవిక భాష, అనాగరిక ప్రవర్తన, అవినీతి చరిత‌్ర, బెదిరింపు ధోరణి, నేరస్వభావం ఉన్న నాయకులను మధ్యతరగతి వర్గం ఎప్పుడూ అసహ్యించుకుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి మిథ్యాలోకంలో ఉండదు. వాస్తవిక ధోరణి కలిగి ఉంటుంది. 


న్యూట్రల్లో ఓటర్లు..దారెటు

ఇంగ్లీష్‌లో బిట్వీన్‌ ది లైన్స్ అంటారు. ఏ మాటల మాటున ఏ అర్థాలు ఉన్నాయో పసిగట్టేయలగలరు. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో జగన్‌ ఓటమికి ఇవే కారణాలు. ఈ వర్గం అవినీతి పరుడైన జగన్‌ని తిరస్కరించింది ఇందుకే. తాజాగా చేయిస్తున్న అధ్యయనాల్లో ఏపీలో మధ్యతరగతి వర్గం మరోసారి టీడీపీ వైపు నిలబడనుందని తేలింది. ఏ ఎన్నికల్లో తీసుకున్నా నిర్ణయాత్మక ఓటు మధ్య తరగతిదే. రాష్ట్రం లో మంచి పాలన ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, మన తరవాతి తరాలు బాగుంటాయి, మన వంశంలో పుట్టబోయే తరాలన్నీ ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తాయని వాస్తవికంగా ఆలోచించేది మధ్యతరగతే.వీరు నాయకుల తప్పు ఒప్పులు కంటే కూడా... రాష్ట్రంలో పట్ల నాయకుల విజన్ ను చూస్తారు. అందుకే 2014లో చంద్రబాబును గెలిపించారు. కానీ ఈ వర్గం వారి అభిప్రాయం ఇంకా మారలేదని తెలుస్తోంది. పిల్లలు, వారి భవిష్యత్తు సుఖంగా ఉండాలి ఇపుడు ఉన్న వారిలో ఎవరు మంచి ఆప్షను అనే ఆలోచనలో వారు తరచితరిచి ఫలితం చూసుకున్నారు. అందుకే కొన్ని పొరపాట్లు కనిపించినా వారు చంద్రబాబు వైపు నిలబడ్డారు. అసలు పాయింట్ ఏంటంటే... ఉన్నదాంట్లో సర్దుకోవడం వారికి అలవాటు అయినట్టే... ఉన్నవారిలో బెస్టు ఎంచుకోవడం కూడా ఒంటబట్టించుకున్నారు. అలా ఆలోచించిన వారికి ఇసుక అక్రమాలు, వనజాక్షి, స్థానికంగా కొందరు ఎమ్మెల్యేలు చేసిన తప్పులు పెద్దగా కనిపిస్తాయా.. కులం, మతం, ప్రాంతం ఇవి వినడానికి మాట్లాడటానికి బాగుంటాయి రేపు మనకు దేనికి అవసరపడవు. ఇరుగు పొరుగు, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఈ వర్గం కులాలను చూస్తుంది గాని... రాష్ట్రాన్ని అప్పగించడానికి కులాన్ని చూడదు. నిరంతరం బూతులతో దాడి చేసి సోషల్ మీడియా చూడాలంటేనే భయం పుట్టిన వైసీపీ అభిమానులే జగన్ అంటే ఈ వర్గంలో మరింత భయం పెంచారు. పైగా ఎన్నికల ముందు బాబాయి హత్య ఈ వర్గానికి మరింత భయం కలిగించింది. దాని ఫలితం బయటకు రాకుండా వైసీపీ చేసిన ప్రయత్నాలు వారిలో భయం పెంచాయి. ఇలా జగన్ వీరాభిమానుల సహకారంతో మధ్యతరగతి చంద్రబాబు వైపు మొగ్గిందని అంటున్నారు. 

No comments:

Post a Comment