Breaking News

04/03/2019

టీటీడీపీకి దారులు మూసుకుపోయినట్టేనా

హైద్రాబాద్, మార్చి 4, (way2newstv.in)
తెలంగాణ శాసనసభ లో టిడిపి ఉనికి పూర్తిగా కనుమరుగవుతుందా? రాష్ట్రంలో ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కానుందా?… అంటే అవుననే సమాధానమే వస్తోంది. అసెం బ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టిడిపి ఎంఎల్‌ఎల్లో సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీకి ఒక్క ఎంఎల్‌ఎనే మిగిలాడు. ఆయన కూడా టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసెంబ్లీలో టిడిపి శూన్యం కానుంది.గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వచ్చా యి. ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు స్వయంగా ఆయనే చెప్పినట్లు కూడా ప్రచారం జరిగింది. నిజానికి సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం వీడి టిఆర్‌ఎస్‌లో కలవనున్నట్లు చాలాకాలం క్రితమే వార్తలు వచ్చాయి. 


టీటీడీపీకి దారులు మూసుకుపోయినట్టేనా

కానీ ఆయన వాటిని కొట్టిపారేశారు. తన నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని, టిఆర్‌ఎస్‌లో చేరడంపై ఇంకా నిర్ణయం జరగలేదన్నారు. కానీ టిఆర్‌ఎస్‌లో త్వరలో చేరనున్నట్లు ఆదివారం స్వయంగా ఆయనే చెప్పడంతో తదుపరి దృష్టి మెచ్చా నాగేశ్వరరావుపై పడింది. సండ్ర తరహాలోనే ఈయన కూడా పార్టీని వీడేది లేదని చెప్పారు. అయినా అనుమానం మాత్రం బలంగానే ఉందితెలంగాణ ఉద్యమకాలం నుంచే రాష్ట్రంలో టిడిపి ప్రభావం తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ పతనం మొదలైంది. ఓటుకు నోటు కేసు తదనంతరం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కొక్కరుగా అధికార టిఆర్‌ఎస్‌లో చేరడం ప్రారంభించారు. మరికొద్దిమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో 15 మంది ఎంఎల్‌ఎలు గెలిస్తే, అందులో 12 మంది టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. మిగిలినవారిలో ఆర్.కృష్ణయ్య ఆ పార్టీతో అంటీముంటనట్లుగా వ్యవహరించారు.రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు సీతక్క వంటి ముఖ్య నేతలు దాదాపు 20 మంది కాంగ్రెస్‌లో చేరడంతో టిడిపి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, పెద్దిరెడ్డి వంటి రాష్ట్ర నాయకులు ఉన్నప్పటికీ, కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఎవరూ లేరు. దీంతో టిడిపి క్యాడర్ చెల్లచెదురై పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఇద్దరైనా గెలిచారనే సంతోషం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయేలా ఉంది

No comments:

Post a Comment