Breaking News

18/03/2019

సమాచార హక్కు అమలు చేయాలి

సిద్దిపేట, మార్చి 18 (way2newstv.in)
రాష్ట్రంలో అవినీతి పరులను కాపాడడానికి సమాచార హక్కు చట్టాన్ని బయటకు రాకుండా పాలకులు చట్టాన్ని కప్పి పెడుతున్నారని, అందుకు కొంతమంది ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని సమాచార చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షుడు  జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పరులను కాపాడడానికి సమాచార హక్కు చట్టాన్ని బయటకు రాకుండా పాలకులు చట్టాన్ని కప్పి పెడుతున్నారని, అందుకు కొంతమంది ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని సమాచారం కోరుతూ దరఖాస్తు చేస్తే నెలలు గడిచి పోతున్న దరఖాస్తు దారులకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు.



సమాచార హక్కు అమలు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం భూ శుద్దీకరణ పేరుతో జీవో తెచ్చి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎన్నికలకు ముందు ఆచరణలో సాధ్యపడని హామీలు ఇచ్చి వాటిని నిర్వర్తించకుండా ఉండడానికి అనేక మెలికలు పెడుతున్నారని రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఆపడానికే భూ శుద్దీకరణ చట్టం తీసుకువచ్చి కొత్త పాస్ బుక్ ల పేరుతో తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు. "కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఉడిపోయినట్లు" కొత్త పాసు బుక్కు లతో బాధలు తీరుతాయని ఆశపడిన రైతుల కంటిలో కన్నీళ్లే మిగిలాయి అన్నారు. తహసిల్దార్లు రైతులకు పాసుబుక్కులు ఎందుకు ఇవ్వడం లేదో దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తామని ఎందుకు ప్రభుత్వ స్పందనను బట్టి రైతులందరికీ మేలు జరిగే విధంగా పోరాటం చేస్తామని, కొన్ని కార్యాలయాల్లో రైతులు, ప్రజలు పాసు బుక్కుల గురించి అడుగుతే దాడులు చేశారని ఇలాంటి దాడుల వల్ల రైతులు నష్టపోవడమే కాకుండా మానసిక క్షోభకు గురి అయ్యారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షుడు తాళ్ళ కరుణాకర్, మండలాల అధ్యక్షులు యాదగిరి, దినేష్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment