Breaking News

18/03/2019

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

నెల్లూరు, మార్చి 18 (way2newstv.in)
రాష్ట్రంలో  గోదావరి కృష్ణా నదులు కలిపాం.  గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి నిరంతరం కృషి చేస్తున్నాం.  కోటి మంది పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు ప్రవేశపెట్టాం. . వైఎస్ జగన్ చిన్నాన్న హత్య జరిగితే దానిని ఎందుకు దాపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.  ఒక హత్య జరిగితే సాక్షాలను తారుమారు చేయం, పోలీసులకు సమాచారం అందింస్తాం.  గుండెపోటు వచ్చిందని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అయన విమర్శించారు. సోమవారం నెల్లూరులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గోదావరి- పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. 


సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ కార్యకర్తల మనిషినని, కార్యకర్తల త్యాగాలు తెలిసిన వ్యక్తినని చెప్పారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పూర్తిచేసింది టీడీపీనేనని అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందన్నారు. రూ.30 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని, కౌలుదారులకు పెట్టుబడినిధి కింద సాయం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తె లంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏపీపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన ఏజెంటుగా జగన్ ను ఎంపిక చేసుకున్నారని, వైసీపీకి డబ్బు పంపి ఏపీలో రాజకీయాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన  సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రమంత్రా తెలుగుదేశం గాలి వీస్తోందన్నారు. 150 సీట్లకు పైగా రాష్ట్రంలో టీడీపీ గెలవాలని చంద్రబాబు అన్నారు.

No comments:

Post a Comment