జగిత్యాల, మార్చ్ 18 (way2newstv.in)
దేశానికి మంచి నాయకత్వం కావాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాల పర్యటనకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెరస్, బీజేపీ పాలనలో దేశాభివృద్ది కుంటుపడిందని ఆమె అన్నారు. అభివృద్దిలో చిన్న దేశాలకన్నా మనదేశం వెనకబడివుందని అన్నారు.
విజన్ వున్న నాయకుడు కేసీఆర్
కేసీఆర్ విజన్ వున్న నాయకుడు. పుల్వామా దాడి బాధితులకు ఆర్ధిక సహయం చేసిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె అన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవరసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ నోట్లు, మాటలు మార్చడం తప్ప చేసింది ఏంలేదని విమర్శించారు. జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కవిత అన్నారు. ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిపించాలని ఆమె కోరారు
No comments:
Post a Comment