Breaking News

01/03/2019

గ్రేటర్ లో కెపాసిటీవ్ సెన్సార్స్

హైద్రాబాద్, మార్చి 1, (way2newstv.in)
బయోమెట్రిక్ యం త్రాల బురిడికి చెక్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. సిబ్బంది విధుల్లోకి రాకున్నా, సింథటిక్ (కృత్రిమ) వేలిముద్రలతో హాజరు వేసినట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాంకేతికతపై అధికారులు దృష్టిసారించారు. సంబంధిత వ్యక్తి వేలిముద్రలతో మాత్రమే హాజరు వేసేలా ప్రత్యేక సెన్సా ర్లు వినియోగించాలని నిర్ణయించారు.

 గ్రేటర్ లో కెపాసిటీవ్ సెన్సార్స్

ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుం దని, వచ్చే సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని యంత్రాల వినియోగం ప్రారంభిస్తామని ఐటీ విబాగం అధికారులు  తెలిపారు. ఇందుకోసం కెపాసిటీవ్ సెన్సార్స్ వాడనున్నట్టు చెప్పారు. దీంతో సంబంధిత కార్మికుడు స్వయంగా వేలిముద్ర వేస్తేనే అతని హాజరు పడుతుంది. ఇటీవల స్వాధీనం చేసుకున్న ఎనిమిది యంత్రాలకు కొత్త సెన్సార్లను అమర్చి, ప్రయోగం ఫలిస్తే గ్రేటర్ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు.

No comments:

Post a Comment