హైద్రాబాద్,మార్చి 1, (way2newstv.in)
మహిళా ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించడంతో ఆ ఛాన్స్ దక్కెదేవరికన్నది చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటే మంత్రి పదవి ఎవరికన్నది పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు అందులో ఇద్దరిని మంత్రులం చేస్తామని సీఎం ప్రకటించడంతో ముగ్గురిలో ఆ ఇద్దరు ఎవరన్నదీ? ఆసక్తికరంగా మారింది.
టీఆర్‌ఎస్ నుంచి శాసనసభలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో పద్మాదేవేందర్‌రెడ్డి గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా, గొంగడి సునీత ప్రభుత్వ విప్‌గా పని చేశారు.
ఆ ఇద్దరు ఎవరు...
రేఖా నాయక్ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రేఖా నాయక్ గిరిజన సామాజిక వర్గానికి చెందడంతో ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం లభించని గిరిజన, మహిళా కోటా రెండూ భర్తీ చేసినట్టు అవుతుందని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. పైగా ముగ్గురు ఎమ్మెల్యేల్లో గిరిజన మహిళా ఎమ్మెల్యే ఒకే ఒక్కరు కావడంతో రేఖా నాయక్‌ను పక్కన పెట్టి మిగిలిన ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. మిగిలిన వారిలో పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరిద్దరికీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో సామాజిక సమీకరణ కోణంలో రేఖా నాయక్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పద్మాదేవేందర్‌రెడ్డి కంటే గొంగడి సునీతకే ఎక్కువగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అత్యున్నత వర్గాల సమాచారం.
No comments:
Post a Comment