Breaking News

25/03/2019

కష్టకాలంలో ఉన్నా.. పట్టించుకోలేదు..

హైద్రాబాద్, మార్చి 25, (way2newstv.in)
కేసీఆర్ నమ్మించి గొంతు కోశారని ఆరోపించిన మాజీ ఎంపీ వివేక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. ఇంతకు ముందే ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన వివేక్.. సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చివరి నిమిషంలో తన పేరును తప్పించి మరొకరికి టికెట్ కేటాయించారని ఆయన ఆరోపించారు. తనకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టినా ప్రోటోకాల్‌ పాటించలేదని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. 


కష్టకాలంలో ఉన్నా.. పట్టించుకోలేదు..

తెలంగాణకు, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు జాతీయ స్థాయిలో ఇప్పుడు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్‌కు కష్టకాలంలో నేను అండగా ఉన్నాను.. కానీ చివరి క్షణంలో ఎంపీ టికెట్ అభ్యర్థిత్వాన్ని మార్చి, తగిన ప్రతిఫలం ఇచ్చారని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్‌పై ఇప్పటి వరకూ తన తండ్రి వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో భాగంగా.. నా బిడ్డ పెళ్లికి మూడురోజుల ముందు అరెస్టయ్యాయని వివేక్ చెప్పారు. ‘అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఆవిర్భవిందా ? లేదా కేసీఆర్ అండ్ టీం వల్ల ఏర్పడిందా’ అని వివేక్ ప్రశ్నించారు. తక్కువ టైం ఉండటంతో.. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు.

No comments:

Post a Comment