ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో చిత్రం చేయబోతున్నారు. `హీరో` అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తారు. ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
నాలుగు దక్షిణాది భాషల్లో హీరో విజయ్ దేవరకొండ మూవీ `హీరో`
అంత కంటే ముందు సినిమా ఎప్పుడు లాంఛనంగా ప్రారంభమవుతుంది.. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి దర్శకత్వం: ఆనంద్ అన్నామలై, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర, మోహన్(సి.వి.ఎం), సి.ఇ.ఒ: చెర్రీ.
No comments:
Post a Comment