Breaking News

13/03/2019

మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ

గుంటూరు మార్చి 13, (way2newstv.in)  
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లి నియోజక వర్గంనుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం నాడు టిడిపి అధిష్టానం స్పష్టతనిచ్చింది. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్ధిపై వైకాపా అభ్యర్ది ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం సాధించారు. 


మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ

లోకేశ్ తొలుత విశాఖలోని భీమిలి నియోజకవర్గం లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి రంగంలోకి దిగుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.  అనేక సమీకరణాల తరువాత లోకేశ్ను మంగళగిరినుంచి పోటీకి దింపాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది.

No comments:

Post a Comment