Breaking News

27/03/2019

మిర్చి రైతు కంట కన్నీరు

కర్నూలు, మార్చి 27, (way2newstv.in
కర్నూలులో వ్యాపారులు కుమ్మక్కై మిర్చి రైతులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరిలో క్వింటా రూ.10 వేలు ఉండగా, ఆకస్మాత్తుగా రూ.2 వేల నుండి 5400లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చేశారు. ఫలితంగా రూ.8 వేల నుండి రూ.10 వేలకు పెంచారు. అయితే వ్యాపారులు మళ్లీ రింగ్‌గా ఏర్పడి రూ.5 వేల నుండి రూ.6500లకు తగ్గించారు. గుంటూరు జిల్లాలో రెండేళ్లుగా ధరలు బాగా రావడం, ప్రభుత్వం నుండి వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించడంతో రైతులు కంది, మినుము, పెసర సాగు చేశారు. అయితే ఈ ఏడాది రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో మినుముల ధర రూ.3,800 పడిపోయింది. పెసలు రూ.4000, వేరుశనగ రూ.4 వేలకు తగ్గింది.కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు కుమ్మక్కై మిరప రైతులను మోసం చేస్తున్నారు. గత నెలలో క్వింటా ధర గరిష్టంగా రూ. 10 వేలు ఉండగా వ్యాపారులు సగానికి సగం తగ్గించారు. రూ. 2 వేల నుంచి రూ.5400కు వేలం పాడారు. దీంతో రైతులు ఆగ్రహించి ఆందోళన చేయడంతో అధికారులు రూ.8 వేలు నుంచి రూ.10 వేలు వరకు పెంచారు. మార్కెట్‌కు ఏప్రిల్‌ మొదటి వారం వరకూ సెలవులు ప్రకటించిన కారణంగా సరుకు మార్కెట్‌కు పెద్ద ఎత్తున వచ్చింది. 


మిర్చి రైతు కంట కన్నీరు

ఆర్ధిక సంవత్సరం చివరి రోజులు కావడంతో లెక్కలు చూసుకోవడానికి కొనుగోళ్లు నిలిపి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మళ్లీ దళారులు కుమ్మక్కై నాణ్యత బాగున్నప్పటికీ ధరలను తగ్గించారు. శనివారం మార్కెట్‌ యార్డులో క్వింటా రూ.5 వేల నుంచి 6,500 పలికింది. దూర ప్రాంతాలనుంచి వచ్చిన రైతులు చేసేది లేక వచ్చిన ధరకు అమ్ముకున్నారు. దీంతో రైతులు దిక్కు తోచక వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. మిరప విక్రయాలకు టెండరు విధానం లేకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు రైతులు చెపుతున్నారు. దళారులు, పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసుకుని ప్రభుత్వం ధరలు పెంచినపుడు అమ్ముకుంటున్నారు. గుంటూరు జిల్లాలో అపరాల సాగూ రైతులను నష్టాల బాట నుండి గట్టెక్కించలేకపోయింది. ఈ ఏడాది నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో వరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆరుతడి పంటలు పడించాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ మేరకు జిల్లాలో గుంటూరు, నర్సరావుపేట డివిజన్లలో ఎక్కువ మంది మినుము, పెసర, శనగ, కంది సాగు చేపట్టారు. డెల్టాలో వరి తర్వాత రెండో పంటగా జొన్న, మొక్కజొన్నతోపాటు కొంతమంది మినుము, పెసర, వేరుశనగ సాగు చేశారు. ్ష ఎకరాల్లో మినుము, 54 వేల ఎకరాల్లో పెసర సాగు చేశారు. పెట్టుబడి భారీగా పెరిగి ఆదాయం తగ్గిందని అపరాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. డెల్టాలో రెండో పంటగా ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగు చేశారు. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా గతేడాది క్వింటా రూ.1500 ఉన్న ధర ఈ ఏడాది రూ.1100కు పడిపోయింది. సాగర్‌ ఆయకట్టు పరిధిలో 80 వేల ఎకరాల్లో శనగ సాగైంది. శనగల ధర క్వింటాలు రూ.4,450గా మార్క్‌ఫెడ్‌ ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.3400 మాత్రమే ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలు వస్తున్నా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందులకు రూ.5450 మద్ధతు ధరలతో మార్కెఫెడ్‌ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోలు చేపట్టారు. బహిరంగ మార్కెట్‌లో కందుల ధర రూ.4500 మాత్రమే ఉంటోంది. దీంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా ఇక్కడ అధికారులు పెడుతున్న నిబంధనలను రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మాచర్ల ప్రాంతంలో వ్యాపారుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెపుతున్నారు. కొన్నిచోట్ల రాజకీయంగా పలుకుబడి కలిగిన వారి వద్దనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని రొంపిచర్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. రెండేళ్ల కిందట కందులు, మినుములు, పెసరలు, శనగలు.. అన్ని రకాల అపరాల పంటలకు క్వింటాలు రూ.10 వేలకు తగ్గకుండా ధరలు రావడంతో రైతులు కొంత మేరకు లబ్ధిపొందగా ఈ ఏడాది భారీగా ధరలు పడిపోవడంతో కుదులేవుతున్నారు

No comments:

Post a Comment