కర్నూలు, ఫిబ్రవరి 9, (way2newstv.in)
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ నెలాఖరు, లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్న తరుణంలో జిల్లాలో క్రమంగా ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా మొదలు బీజేపీ, వామ పక్షాల మద్దతుతో బరిలో దిగనున్న జనసేన, ఒంటరి పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, గెలుపే ధ్యేయంగా అధిష్టానాలు ప్రజాకర్షక పథకాలు, తాయిలాలు ప్రకటిస్తుండగా, అధికార పార్టీలో ఆశావహులు, సిట్టింగ్‌లు తాజా రాజకీయ పరిణామాలను, సామాజిక వర్గాల సమీకరణలను బేరీజు వేసుకుంటూ తమ రాజకీయ భవిష్యత్‌పై అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి, నిరంకుశ చర్యలతో విసిగిపోయామంటూ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. దీంతో మండల స్థాయిలో నాయకులు పార్టీని వీడిపోతున్నారు.
జిల్లాల్లో ప్రారంభమైన ఎన్నికల హడావిడి
ఇప్పటికే కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, తదితర నియోజకవర్గాల్లో పచ్చకండువాలు కింద పడేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌లకే పార్టీ అధినేత చంద్రబాబు టికెట్టు కేటాయిస్తారన్న నమ్మకం కూడా కొందరిలో సన్నగిల్లుతోందని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 30 నుంచి 40 మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్ దక్కక పోవచ్చని, ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లో ఉన్న వ్యతిరేకత, జిల్లా నేతలు, నియోజకవర్గాల్లో వర్గాల్లో విభేదాలతో సమన్వయం కొరవడటం వంటి కారణాలతో అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ముందస్తుగా ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని పాయింట్లు కేటాయించిన విషయాన్ని పార్టీ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, లేకుంటే వేటు తప్పదంటూ అధినేత హెచ్చరిస్తూ ఉండటం విదితమే.మరోవైపు సామాజిక సమీకరణల నేపథ్యంలో అనంతపురం సహా ఒకట్రెండు స్థానాలు స్థానాల్లో మార్పు ఉండవచ్చన్న ప్రచారమూ సాగుతోంది. ఇక టీడీపీలోని అసంతృప్తులు, తటస్థులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తూ పార్టీలో చేర్చుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎవరికి టికెట్లు వస్తాయో, ఎవరికి రావోనన్న అందోళనా లేకపోలేదు. దీంతో గెలుపోటములు ఎలా ఉన్నా తామూ ఎన్నికల బరిలో నిలవాలన్న ఉత్సాహవంతులు ముందుకు వస్తున్నారు. ఇక రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామంటూ పదేపదే చెబుతున్న జనసేన పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందనే చెప్పాలి. ఈ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో ఆయన వ్యూహమేమిటన్న దానిపై స్పష్టత కొరవడింది. ఇక బీజేపీ సైతం క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ లేక పోవడంతో డాంబికాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లాలో అభ్యర్థుల్ని వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటుండటం విశేషం
No comments:
Post a Comment