Breaking News

15/02/2019

సైన్యానికి , ప్రభుత్వానికి మా మద్దతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (way2newstv.in
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపాన్ని తెలిపారు. కేంద్రానికి, జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు యావత్ భారతం ఐక్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. 


సైన్యానికి , ప్రభుత్వానికి మా మద్దతు

సైనికులపై దాడి చేయడం విషాద‌క‌ర‌మైంద‌ని, హేయమైన చర్యన్నారు. దేశాన్ని విభ‌జించ‌డ‌మే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు తెగబడుతున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా దేశం మొత్తం ఐక్యంగా ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇది విషాద‌క‌ర‌మైన రోజు.. 40 మంది జ‌వాన్ల ప్రాణాల‌ను కోల్పోవడం ఎంతో బాధించిందన్నారు. దేశం మొత్తం జవాన్ల కుటుంబాలకు అండగా ఉన్నామన్న సందేశం పంపించాలన్నారు. ముష్కర మూకలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ప్రధాని. 

No comments:

Post a Comment