Breaking News

22/02/2019

శానీ ఇండియా డీలర్ షిన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ ఫిబ్రవరి 22 (way2newstv.in
ఎక్సకవేటర్లు , కాంక్రీట్ మెషినరీ , హెవీ ఎక్విప్ మెంట్ , పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించడంతో సుప్రసిద్ధ తయారీదారు శానీ ఇండియా, తెలంగాణలో తమ ఉనికిని బలోపేతం చేసుకుంటూ తమ డీలర్ షిన్ మధుర ఇంజినీరింగ్ నూతన ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ఇక్కడ ప్రారంభించింది. ఈ సందర్బంగా శానీ ఇండియా సీఈ వో దీపక్ గార్గ్ మాట్లాడుతూ మధుర ఇంజినీరింగ్ సర్వీసెస్ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కేంద్రం అత్యంత కీలకమైన సంబంధాన్ని కంపెనీ మరియు వినియోగదారుల నడుమ అందించడంతో పాటుగా మా సర్వీస్ డెలివరీని మరింత బలోపేతం చేస్తుంది. శానీ నుంచి మేము మా మార్కెటింగ్ సాంకేతిక మద్దతును అవసరమైన చోట విస్తరించనున్నాం అని అన్నారు.దాదాపు 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని మధుర ఇంజినీరింగ్ నూతన కార్యాలయంలో ఎక్సకవేటర్  , కాంక్రీట్ , రోడ్ ఎక్విప్ మెంట్ శ్రేణి మొత్తం శానీ ఉత్పత్తులను విక్రయిస్తారు. 


శానీ ఇండియా డీలర్ షిన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం


వీడిలో సాంకేతికంగా అత్యాధునికమైన ఎక్సకవేటర్లు, మాడ్యూలర్ డిజైన్డ్ బ్యాచింగ్ ప్లాంట్ ,సుపీరియర్ డిజైన్డ్ ట్రాన్సిట్ మిక్సర్లు, నిరూపించబడిన మరియు నమ్మకమైన కాంక్రీట్ పంపులు, ఆధారపడతగిన మరియు సమర్థవంతమైన మోటర్ గ్రేడర్లు మరియు అత్యద్భుతమైన పనితీరు కలిగిన పేవర్లు ఉంటాయి.ప్రరంభమైన నాటి నుంచి వినియోగదారులకు సంతృప్తి అందించడాన్ని మా ప్రధాన లక్ష్యంగా చేసుకున్నామన్నారు. మా అత్యున్నత ప్రొడక్ట్ లైన్ తో పాటుగా బలీయమైన డీలర్ షిప్ నెట్ వర్క్ మా లక్ష్యం సాకారం కావడంలో సహాయపటటంతో పాటుగా భారతదేశంలో నాయకత్వ స్థానం చేరుకోవాడానికి దగ్గరగా చేర్చిందని తెలిపారు. సాంకేతికంగా అత్యాధునికమైన ఉత్పత్తులను అందించడంతో పాటుగా అదే విధమైన నిశ్చయంతో ముందుకు సాగుతూ మా వినియోగదారులు మరియు డీలర్లకు సానుకూల మార్పును తీసుకురానున్నాం అని అన్నారు.నూతన డీలర్ షిప్ ద్వారా మొత్తం ఎక్సకవేటర్ , కాంక్రీట్ మరియు రోడ్ ఎక్విప్ మెంట్ శ్రేణి శానీ ఉత్పత్తులతో సహా సాంకేతికంగా అత్యాధునికమైన ఎక్సకవేటర్లు , మాడ్యులర్ డిజైన్డ్ బ్యాచింగ్ ప్లాంట్ , సుపీరియర్ డిజైన్డ్ ట్రాన్సిట్ మిక్సర్లు , నిరూపించబడిన మరియు నమ్మకమైన కాంక్రీట్ పంపులు, ఆధారపడతగిన మరియు సమర్థవంతమైన మోటర్ గ్రేడర్లు మరియు అత్యద్భుతమైన పనితీరు కలిగిన పేవర్లు విక్రయించనున్నారు.ఈ ఔట్ లెట్ మరింతగా శానీ యొక్క వాగ్ధానమైన 8111 కస్టమర్ సపోర్ట్ (8 గంటలలో స్పందన, ఒక్క రోజులో మెషీన్ పునరుద్ధరణ) బలోపేతం. 24 గంటలూ కస్టమర్ సర్వీస్ అందించేందుకు శానీ ఇండియో ఓటోల్ ఫ్రీనెంబర్ ను అమ్మకం మరియు సర్వీస్ ఆధారిత సమస్యల కోసం ఏర్పాటు చేసింది. వినియోగదారులు 1800-209-3337 కు కాల్ చేయవచ్చునని తెలిపారు.నేడు శానీ ఇండియా డీలర్ నెట్ వర్క్ లో 25 మంది డీలర్లు , 100 కు పైగా టచ్ పాయింట్లు భారతదేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ డీలర్ షిప్స్ ద్వారా శానీకి 300 కు పైగా బలీయమైన సేల్స్ టీమ్ మరియు 400 కు పైగా సర్వీస్ టీమ్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. 

No comments:

Post a Comment